Former Tennis Star Li Na Becomes Mother to Baby Girl

Baby girl for chinese tennis star li na

Li Na, Na Li, Tennis, Former Tennis Star Li Na Becomes Mother to Baby Girl, latest Tennis news, China's two-time Grand Slam winner, Li Na gave birth to a girl, Alisa

Li Na's fans quipped that Alisa was born for tennis. June 3 is also the birthday of Spanish tennis star Rafael Nadal.

చైనా టెన్నిస్ స్టార్ లీనాకు పండంటి ఆడబిడ్డ..

Posted: 06/03/2015 07:06 PM IST
Baby girl for chinese tennis star li na

చైనా కు చెందిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, రెండు పర్యాయాలు చైనా గ్రాండ్ స్లామ్ సాధించిన టెన్నీస్ దిగ్గజం.. లీనా ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమెకు అలిసా అని నామకరణం చేసింది. గర్భం దాల్చడంతో గత ఏడాది సెప్టెంబర్ లో ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన లీనా.. ఇవాళ ఉదయం తనకు అమ్మాయి పుట్టగానే అమె.. తన కూతురు పాదాన్ని ఫోటో తీసి చైనాలో అతిపెద్ద సామాజిక మాధ్యమంగా నిలిచిన వైబో లో పోస్టు చేసింది. లీనీ బీజింగ్ లోని అస్పత్రిలో తన కూతురుకి జన్మనిచ్చిందని, అమె స్నేహితురాలు.. ప్రస్తుతం చైనా టెన్నీస్ స్టార్ గా వెలుగోందుతున్న ఝంచ్ జీ తెలిపారు.

అయితే ప్రసవం సుఖవంతంగా సాగిందని, అంతా ఊహించినట్టుగానే సాగినా.. తాను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించే ముందు లీనా కు వున్న పెద్ద పోట్ట మాత్రమే కనబడటం లేదని, మిగిలినదంతా సవ్యంగానే వుందని జీ వ్యాఖ్యానించింది. అయితే లీనా టెన్నిస్ లో రాణించడంతో అమె కూతురు కూడా టెన్నిస్ లో బాగానే రాణిస్తుందని, అందుకు కారణాలను కూడా చెబుతున్నారు అమె అభిమానులు. జూన్ 3న రాఫెల్ నాదల్ జన్మదినమని.. అతని మాదిరిగానే అలిసా కూడా పెద్ద టెన్నీస్ స్టార్ అవుతుందని అంటున్నారు. కాగా తాను తన భర్త ఇద్దరు అలిసాను 18 ఏళ్ల వరకు మాత్రమే సాకేందుకు అంగీకరించామని, ఆ తరువాత అమె అర్థికంతో పాటు అన్ని విధాలుగా అమె అలోచించుకుని, సంపాదించుకోవాల్సి వుంటుందని పేర్కోన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Li Na  Alisa  Rafael Nadal  tennis  

Other Articles