Saina storms into maiden final in all england championship

Saina scripts history, Saina storms into maiden final, Saina into All England Championship final, All England Championship, indian badminton star saina nehwal, fast-rising H S Prannoy, Saina, Prannoy move into Round 2, women's and men's singles competition, All England badminton championships, Barclaycard Arena at brihimgham, Badminton, Saina Nehwal, H S Prannoy, All England Championship

Saina Nehwal is now just one step away from joining Indian legends Prakash Padukone (1980) and P Gopichand (2001) who have bagged the prestigious title in the past.

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోకి సైనా..

Posted: 03/08/2015 01:54 PM IST
Saina storms into maiden final in all england championship

కెరీర్‌‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకోవాలన్న సైనా నెహ్వాల్ అందుకు అనుగూణంగా అడుగులు వేస్తోంది. ఆల్ ఇంగ్లాడ్ ఛాంపియన్ షిఫ్ లో రెండు పర్యాయాలు సెమీ ఫైనల్ లో ఓటమి పాలై వెనుదిరిగిన సైనా.. ఈ సారి చరిత్ర సృష్టిస్తూ.. ఫైనల్ లోకి దూసుకెళ్లింది. తొలిరౌండ్ ను ధాటిగా ఆడి తన ప్రత్యర్థులను మట్టి కరింపించిన సైనా నెహ్వాల్ తొలిరౌండ్ లో ఇండోనేషియా క్రీడాకారిణి మనుపుట్టిని రెండో రౌండ్ లో కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యోమిన్ తో తలపడి గెలపును ఆస్వాధించింది, అక్కడి నుంచి వెనక్కు చూడకుండా ఛాంఫియన్ షిప్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది.

ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా హైదరాబాదీ చరిత్ర సృష్టించింది.  మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-13, 21-13 స్కోరుతో చైనా షట్లర్ సన్ యూపై అలవోక విజయం సాధించింది. సైనా వరుస గేమ్ల్లో మ్యాచ్ను స్వంతం చేసుకుంది.  క్వార్టర్ ఫైనల్స్ లో యియాన్ వాంగ్ ను 21-19, 21-6 తేడాతో ఓడించింది. ఇవాళ జరగునున్న మరో సెమీ ఫైనల్ విజేత తో ఫైనల్ లో సైనా నెహ్వల్ తలపడనుంది. స్పెయిన్ కు చెందిన కారోలినా మారిన్.. చైనాకు చెందిన తైపై ల మధ్య ఇవాళ మరో సెమీ ఫైనల్ జరగనుంది. ఐదు లక్షల డాలర్లు ప్రైజ్ మీన ఉన్నఈ టోర్నీలో ప్రవేశించి సైనా నెహ్వాల్ భారత క్రీడా ప్రపంచం కీర్త ప్రతిష్టలను పెంచారు.

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు చేరిన సైనా విజయం సాధించి టైటిల్ ను సంపాదించగలిగితే.. ఈ టైటిల్ ను దక్కించుకున్న మూడవ భారతీయురాలు అవుతుంది. 1980లో ప్రకాష్ పదుకునే ఈ టైటిల్ ను తొలిసారిగా భారత్ తరపున సాధించారు. ఆ తరువాత 2001లో పుల్లెల గోపిచంద్ సాధంచారు. ఇప్పుడు 24 ఏళ్ల ఆయన శిష్యురాలు సైనా నెహ్వాల్ దీనీని సాధించిన పక్షంలో ఆమె సుమారు 14 ఏళ్ల తరువాత టైటిల్ పై మరోమారు భారత్ పేరు లిఖించబడుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  Saina Nehwal  Finals  All England Championship  

Other Articles