Sania mirza and leander pace wining start in australia

sania mirza winning start at australia open, leander paes winning start at australia open, Australian Open tennis Grand Slam, sania mirza, leander paes, men's and women's doubles events, Sania her Chinese Taipei partner Su-Wei Hsieh, Argentine-Swiss combine of Maria Irigoyen and Romina Oprandi, Canadian-Polish pair of Gabriela Dabrowski and Alicja Rosolska., 10th seeded Paes and South African partner Raven Klaasen, American duo of Scott Lipsky and Rajeev Ram, Americans Steve Johnson and Sam Querrey, Italian pair of Simone Bolelli and Fabio Fognini.

India enjoyed an all-win day at the Australian Open tennis Grand Slam after Leander Paes and Sania Mirza sailed into the second round of their respective men's and women's doubles events here today.

ఆస్ట్రేలియా ఓపెన్ లో శుభారంభం

Posted: 01/21/2015 05:37 PM IST
Sania mirza and leander pace wining start in australia

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్లు శుభారంగం చేశారు. భారత్ తరపున ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గోన్న టెన్నీస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్ తొలి రౌండ్ లో బగా రాణించారు.. ఈ ఈవెంట్లో మూడో రోజైన బుధవారం జరిగిన డబుల్స్ రౌండ్లలో సానియా మిర్జా, లియాండర్ పేస్ లు తమ భాగస్వాములతో కలసి రాణించారు. ముందుగా జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ లో సానియా మిర్జా, అమె భాగస్వామి చైనా టెన్నిస్ క్రీడాకారిణి సు-వీ హ్సి (చైనీస్ తైపీ) జోడీ 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా), రొమినా ఒప్రండి (స్విట్జర్లాండ్)పై సునాయాస విజయం సాధించింది. కేవలం 48 నిమిషాలలో ప్రత్యర్థి జట్టును ఓడించి తొలి రౌండ్ లో విజయం సాధించారు.

ఈ ఇండో తైపీ జోడి కెనడా, పాలిష్ జోడి గాబ్రియేలా దబ్రౌస్కీ, అలిక్జా రోసోల్కాలతో రెండో రౌండ్ లో తలపడనుంది. కాగా పురుషుల డబుల్స్ ఆటలోనూ తొలి రౌండ్లో ఇండో రష్యా జోడి లియాండర్ పేస్, రవెన్ క్లాసెన్ (రష్యా) ద్వయం 6-4, 7-6(6)తో అమెరికా జంట స్కాట్ లిప్స్కీ, రాజీవ్ రామ్పై గెలుపొందింది. ఈ జోడి సైతం తదుపరి మ్యాచ్ లలో అమెరికా స్టీవ్ జాన్సన్, సామ్ క్వెర్రీలతో తలపడనుంది. ఆ తరువాత ఇటాలియన్ జోడి సిమోన్ బోలెల్లి, ఫాడియో పాగ్నినిలతో తలపడనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania-mirza  Leander-paes  Australian-open  

Other Articles