Srikanth pv sindhu reach singapore open quarterfinals

PV Sindhu, Kidambi Srikanth reach Singapore Open quarterfinals, Saina Nehwal, Parupalli Kashyap, PV Sindhu, Singapore Open Superseries, Kidambi Srikanth

V Sindhu, who won the Malaysia Open and Macau Open last year besides the prestigious World Championship bronze.

సింగపూర్ ఓపెన్ లో తెలుగు తేజాల సంచలనం

Posted: 04/11/2014 11:43 AM IST
Srikanth pv sindhu reach singapore open quarterfinals

భారత తెలుగు తేజం, హైదరాబాద్ యువ క్రీడాకారుడు కదాంబి శ్రీకాంత్ సింగపూర్ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నీలో సంచలనం స్రుష్టించాడు. సింగపూర్ ఓపెన్ లో ప్రపంచ పదోనెంబర్ ఆటగాడు తియెన్ గుయెన్ (వియత్నాం) ని ఓడించడం ద్వారా ప్రీ క్వార్టర్స్ నుండి క్వార్టర్స్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.

సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో గుయెన్‌ పై 18-21, 21-18, 21-15 తేడాతో విజయం సాధించాడు. ఓ దశలో శ్రీకాంత్ ఆట పై పూర్తిగా పట్టుకోల్పోయిన పరిస్థితి నుండి తిరిగి కోలుకొని వరుసగా రెండు సెట్లు గెలుచుకొని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ క్వార్టర్స్ ఫైనల్లో అన్ సీడెడ్ ఆటగాడు యుస్ హుతో ఢీకొన బోతున్నాడు.

పురుషుల విభాగంలో సాయి ప్రణీత్ కూడా వాంగ్ సింగపూర్ పై విజయం సాధించి క్వార్టర్స్ లోకి వెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కోగా, మరో హైదరాబాదీ పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. షిజుకా ఉషిదాను ఆమె 21-17, 17-21, 21-16 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో పిసి తులసి పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. ఆమెను ఇహాన్ వాంగ్ 21-19, 21-7 ఆధిక్యంతో చిత్తుచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles