రెండు అగ్రజట్ల మధ్య పోరాటం ఎంత రసవత్తరంగా ఉంటుందో నిన్న ఛాంపియన్ లీగ్ టి20 తొలి సెమీఫైనల్ చూసిన అభిమానులకు తెలిసొచ్చింది. ఆదిలో ఆట ఏకపక్షంగా సాగినా, చివర్లో మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో ముగిసింది. ఇక సొంత గడ్డ పై తనకు తానే సాటి అని నిరూపించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఎంత పటిష్టమైన జట్టు అయినా సొంత గడ్డపై తమ ముందు బలాదూరే అని నిరూపించింది. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఫేవరెట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను బోల్తా కొట్టించి రాజసంగా ఛాంపియన్ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
నిన్న రాత్రి జైపూర్ లో సవావ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైని 14 పరుగుల తేడాతో ఓడించి ఇంటికి పంపించింది. ఛాంపియన్ లీగ్ టి20లో లీగ్ దశ నుండి అద్భుతమైన ఆటను కొనసాగిస్తున్న రాజస్థాన్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (56 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచి అర్ధసెంచరీ చేశాడు. వాట్సన్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు) రహానేకు అండగా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 59 పరుగులు జోడించారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి ఇంటి దారి పట్టింది. చెన్నై 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓదశలో 100 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ చివర్లో రవిచంద్రన్ అశ్విన్ చెలరేగి 28 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు తో పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ ప్రవీణ్ తాంబె (3/10) తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more