జీవిత కాలం కష్టపడి జాతీయస్థాయి జట్టుకు ఆడే స్థాయికి ఎదిగి, జీవితాన్ని ఎంతో హ్యపీగా గడపాల్సిన వారు శాశ్వతంగా క్రికెట్ కి దూరం అయ్యారు. కారణం కాసులకు కక్కుర్తి పడ్డారు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో బుకీలతో కలిసి బెట్టింగులకు పాల్పడ్డ కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్, అంకిత్ చౌవాన్ లకు జీవితకాల నిషేదాన్ని విధించింది. వీరిని శాశ్వతంగా దేశవాళి క్రికెట్ తో సహా బహిష్కరించి ఫిక్సింగ్ కి పాల్పడాలనే ఆలోచన ఎవరికి రాకుండా కఠిన శిక్ష వేసింది. తన ప్రతిష్టతో పాటు, దేశ క్రికెట్ ప్రతిష్టను కూడా దెబ్బతీసిన రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లపై జీవితకాల నిషేధం విధించింది. అయితే స్పాట్ ఫిక్సింగ్‌తో ప్రమేయమున్న మరికొంతమందికి చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టింది. అమిత్ సింగ్‌ను ఐదేళ్లు నిషేధించిన బీసీసీఐ సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది సస్పెన్షన్ వేటు వేసింది. స్పాట్ ఫిక్సింగ్ కి వ్యవహారానికి సంబంధించి, రవి సవానీ నేతృత్వంలో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన సవానీ.. ఆరోపణలెదుర్కొంటున్న శ్రీశాంత్, చవాన్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, వారిపై జీవితకాల నిషేధం విధించొచ్చని కమిటీకి సూచించాడు. దీని పై నిర్ణయం తీసుకోవడానికి సమావేశం అయిన బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అమిత్ సింగ్‌పై ఐదేళ్లు, త్రివేదిని ఏడాదిపాటు నిషేధించాం. హర్మీత్ సింగ్‌పై సరైన ఆధారాలు లేకపోవడంతో చర్యలు తీసుకోవడం లేదు' అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపాడు. గతంలో అజయ్ జడేజా, మహ్మద్ అజరుద్దీన్ ల పై కూడా ఫిక్సింగ్ పై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more