ఐపీఎల్ ఆట అంటేనే వివాదాల పుట్టగా, స్పాట్ ఫిక్సింగ్ కి నిలయంగా మారింది. ఇప్పటికే అనేక నిందలతో సమమతం అవుతున్న దీనికి ఇఫ్పుడు మరో షాక్ తగిలింది. భారత జట్టు స్పాన్సర్, ఐపీఎల్ పూణె జట్టు ఫ్రాంచైజీకి ఓనర్ అయిన సహారా ఇండియా గ్రూప్ ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పూణె వారియర్స్ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. తాము ఐపీఎల్ నుండి తప్పుకోవడానికి బీసీసీఐ కారణం అంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. సహారా గ్రూపు ఏడాదికి రూ. 170.20 కోట్లు బోర్డుకు సహారా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఫీజును సకాలంలో చెల్లించలేదంటూ ఆరోపిస్తూ బీసీసీఐ, తమ వద్ద ఉన్న సహారా బ్యాంక్ గ్యారెంటీనుంచి ఆ ఫీజు మొత్తాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సహారా... ఐపీఎల్‌నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే తరహాలో బీసీసీఐ, సహారా మధ్య వివాదం ఏర్పడగా...చివరకు ఇరు వర్గాలు రాజీ పడ్డాయి. తాజా నిర్ణయం వల్ల పుణే జట్టులో ఆటగాళ్లు, వాటాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, వారికి పూర్తి స్థాయి మొత్తాలను చెల్లిస్తామని సహారా స్పష్టం చేసింది. దీంతో పాటు భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ షిప్ నుండి కూడా తప్పుకుంటున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more