ఐపీఎల్ పొట్టి క్రికెట్ లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు ఏ బ్యాట్స్ మెన్ సిక్స్ ల మోత మోగించి, పరుగుల వరద పారిస్తాడో తెలియదు. ఓడి పోతుందనుకున్న మ్యాచ్ ని ఒంటిచేత్తో ఎవరు గెలిస్తారో తెలియదు. సరిగ్గా పై పరిణామాలన్నీ నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కెరన్ పోలార్డ్ ఆవిష్క్రతం చేసి అందర్ని ఆశ్చర్య పరిచాడు. ఒక దశలో ముంబై సొంత మైదానంలో ఓటమి పాలవ్వక తప్పదనే ఆలోచనకు వచ్చారు. 24 బంతుల్లో 64 పరుగులు చేయాలి. అప్పటి వరకు 10 బంతులు ఎదుర్కొని 9 పరుగులతో క్రీజ్ లో ఉన్న పోలార్డ్ సిక్స్ ర్ల వర్షం కురించాడు. దీంతో అంత పెద్ద లక్ష్యం క్షణాల్లో చిన్నపోయింది. 12 బంతుల్లో 20 పరుగులకు వచ్చింది. పెరీరా, మిశ్రా బౌలింగ్ ను పోలార్డ్ చితక్కొట్టాడు. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయతీరాల్ని చేరుకుంది. లేకలేక సన్‌రైజర్స్ చేసిన అత్యధిక స్కోరు (178) ఇది. అయినా కూడా పొలార్డ్ జోష్‌ముందు ఆ లక్ష్యం నిలువలేకపోయింది.
విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబైకి స్మిత్ (21)తో జత కలిసిన సచిన్ (38) తొలి వికెట్‌కు (రిటైర్డ్ హార్డ్) 26 పరుగులు జత చేశాడు. అనంతరం రినేష్‌కార్తిక్ 30 పరుగులు చేయగా.. ఆఖరు వరకు క్రీజ్‌లో నిలిచిన రోహిత్ శర్మ 20 పరుగులు చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చింది. అందకు ప్రతి ఫలంగానే నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ధావన్ (59) తొమ్మిదితో కలిసి శుభారభం చేసిన పటేల్ తొలి వికెట్‌కు 38 పరుగులు నమోదు చేశారు. ధావన్, విహారీ నిష్ర్కమణ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వైట్ ఆఖరు వరకు అజేయంగా నిలిచి కేవలం 23 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు స్కోరును 178 పరుగులకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పోలార్డ్ కు దక్కింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ టోర్నీ అర్హతను సంక్లిష్టం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more