భారత్‌కు నిలకడగా శుభారంభం అందించిన ఓపెనర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతుండటానికి కొత్త నిబంధనల పట్ల అవగాహన పెంపొం దించుకోకపోవడమే కారణమని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు కొత్త బంతులతో ఇద్దరు మీడియం పేసర్లు చెరో ఎండ్‌లో బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉండటం, ఒకే ఓవర్‌లో రెండు బౌనర్లు వేయడం వంటి నిబంధనలను ప్రవేశపెట్టడం వంటి వాటిపై ఇంకా అవగాహన పెంపొందించుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ పరిస్థితిని ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు అధిగమించి విజయం సాధించగలుగుతామన్న ధీమా వ్యక్తం చేశాడు.
ఇక, కొత్త నిబంధనలు ఏమి చెబుతున్నాయి? వన్డే క్రికెట్ పునరుత్తేజానికి ఈ నిబంధనలు ఏ విధంగా అవకాశం కల్పిస్తాయి? అనే విషయాన్ని పరిశీలిస్తే..
టి20 ఫార్మట్ ప్రజాదరణ చూరగొన్న తరువాత టెస్టు క్రికెట్‌తోపాటు వన్డే క్రికెట్‌కు కూడా కష్టాలు వచ్చిపడ్డాయి. అది క్రమంగా ఆదరణ కోల్పో వచ్చునన్న అభిప్రాయం క్రికెట్ పెద్దలకు కలుగుతోంది. దీంతో ఈ ఫార్మట్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు ఈ నిబంధనలు అవసరమని ఐసిసి చెబుతోంది. వన్డే ఫార్మట్‌లో ప్రాథమికంగా ఏవో లోపాలు, బలహీనతలున్నాయన్న విషయాన్ని ఈ విషయం స్పష్టం చేస్తోంది.
బంతి షేప్ కోల్పోయి పాత బంతిని మార్చాల్సివచ్చినపుడు దాని కంటే మెరుగ్గా ఉన్న పాత బంతిని ఉపయోగించడం ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తోంది. దాని బదులు కొత్త బంతిని ఉపయోగిస్తారు. అలాగే రెండు కొత్త బంతులను ఒకేసారి ఉపయోగిస్తారు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు రెండు ఎండ్‌ల నుండి రెండు కొత్త బంతులతో బౌలింగ్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఫాస్ట్ బౌలర్లకు ఇందువల్ల ప్రయోజనం కలుగుతుంది. స్పిన్ బౌలర్లకు కష్టాలు తప్పవు. వారు కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా 34వ ఓవర్ ముగిసిన తరువాత కొత్త బంతిని ఇస్తారు. అప్పటికి స్పిన్ బౌలర్లు బౌలింగ్ చేస్తుంటారు. రివర్స్ బౌలింగ్ ప్రాముఖ్యత కోల్పోతుంది. ఇప్పటివరకు వన్డే మ్యాచ్‌ల్లో రివర్స్ బౌలింగ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్నింగ్స్ చివరి వరకు బంతి కొత్త దనాన్ని కోల్పోయే అవకాశం ఉండబోదు.
ఇంతకుముందే ఈ నిబంధనను ప్రవేశపెడతారని భావించినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఇది ఫాస్ట్ బౌలర్లకు ఉపకరించే నిబంధన. ఇంతకుముందు ఒక బౌన్సర్‌కు అవకాశం ఉండేది. ఆ బౌన్సర్ పడిన తరువాత బ్యాట్స్‌మన్ అందుకు అనుగుణంగా తన ఆట తీరును మలచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రెండో బౌన్సర్ వేసే అవకాశం ఉన్నందున బ్యాట్స్ మన్ నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడే భారత బ్యాట్స్ మెన్ కు ఇది ఇబ్బంది కలిగించే నిబంధనే.
ఇది అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం. గత వరల్డ్ కప్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను అంతిమ విజేతగా నిలబెట్టిన యువరాజ్ సింగ్ పాక్‌తో జరిగిన సిరీస్‌లో ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి ఈ నిబంధనే కారణమని తెలుస్తోంది. కొంత ప్రాక్టీస్ చేసేవరకు తనకు బౌలింగ్ ఇవ్వవద్దని యువీ పేర్కొన్నట్లు ధోనీ చెప్పాడు. ఇందువల్ల మరో ఫీల్డర్‌ను ఏర్పాటు చేసి బంతి బౌండరీవైపు దూసుకుపోకుండా అడ్డుకునేందుకు, సింగిల్స్ చేసే అవకాశం బ్యాట్స్ మెన్‌కు తగ్గించేందుకు ఈ నిబంధన ఉపయోగ పడుతుంది. ఇది కూడా ఫాస్ట్ బౌలర్లకు ఉపకరించే నిబంధనే. స్పిన్నర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more