స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఉత్కంఠ బరితంగా సాగిన తొలి టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఫాలో ఆన్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆట చివరి రోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌లో 406 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్ 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ (25, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛటేశ్వర్ పుజరా (41 నాటౌట్, 51 బంతుల్లో 8 ఫోర్లు), విరాట్ కోహ్లీ (14 నాటౌట్)లు భారత్ విజయం ఖాయం చేశారు. టీమిండియా 15.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 80 పరుగులతో లక్ష్యం ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ హీరో పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 4 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈ నెల 23 నుంచి ముంబయిలో జరగనుంది.
అనంతరం ఇంగ్లండ్ 340/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. ధోనీ సేన విజయానికి అడ్డుగా నిలిచిన కుక్, ప్రయర్‌లను తొలి సెషన్ ఆరంభంలోనే స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా అడ్డు తొలగించాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఓజా వేసిన 137.4 ఓవర్‌లో ప్రయర్ అతడికే రిటన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రయర్ క్రితం రోజుకు 7 పరుగులే జోడించాడు. దీంతో కుక్, ప్రయర్ జోడీ 6వ వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 9 పరుగుల తేడాతో అలెస్టర్ కుక్‌ను ఓజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓజా వేసిన షాంట్ లెంగ్త్ బంతి లో టర్న్ అయింది. కుక్ డిఫెన్స్ ఆడినా బంతి ప్యాడ్‌ను తాకి వికెట్లను గిరాటేసింది. ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వకుండా భారత్ బౌలర్లు చకచకా వికెట్లు తీశారు. లంచ్ సమయానికే ఇంగ్లండ్‌ను ప్యాకప్ చేశారు. ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో మిగతా 3 వికెట్లు కోల్పోయింది. ఉమేష్ యాదవ్‌కు రిటన్ క్యాచ్ ఇచ్చి స్టువర్ట్ బ్రాడ్ (3) వెనుతిరిగాడు. స్వాన్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జహీర్ బౌలింగ్‌లో బ్రెస్నన్ చివరి వికెట్‌గా వెనుతిరిగాడు.
ఆపై భారత్‌కు విజయం నల్లేరుపై నడకే అయింది. 77 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. రెగ్యులర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్‌కు అందుబాటులో లేక పోవడంతో ఛటేశ్వర్ పుజారా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సెహ్వాగ్, పుజారాలు ఇంగ్లండ్ స్పిన్నర్లు స్వాన్, సమిత్ పటేల్‌లపై ఎదురుదాడికి దిగారు. స్వాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పుజరా 2 బౌండరీలు బాది జోరు ప్రదర్శించాడు. సమిత్ వేసిన 5వ ఓవర్‌లో సెహ్వాగ్ భారీ సిక్సర్ బాదాడు. భారత్ 7.1 ఓవర్‌లోనే 50 పరుగులు చేసింది. స్పిన్నర్ స్వాన్ బౌలింగ్‌లో సెహ్వాగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర పీటర్సన్‌కు చిక్కాడు. పుజరా, కోహ్లీలు గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : మొత్తం : 521/8 డిక్లేర్డ్.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 191 పరుగులు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలో ఆన్) : అలెస్టర్ కుక్ (బి) ఓజా 176, కాంప్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ ఖాన్ 37, ట్రాట్ (సి) ధోనీ (బి) ఓజా 17, పీటర్సన్ (బి) ఓజా 2, ఇయాన్ బెల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేష్ 22, సమిత్ పటేల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేష్ 0, ప్రయర్ (సి అండ్ బి) 91, బ్రెస్నన్ (సి) సబ్ (రహానే) (బి) జహీర్ ఖాన్ 20, బ్రాడ్ (సి అండ్ బి) 3, స్వాన్ (బి) అశ్విన్ 17, అండర్సన్ నాటౌట్ 0, అదనపు పరుగులు 21, మొత్తం (154.3 ఓవర్లలో ఆలౌట్) 406 పరుగులు.
వికెట్ల పతనం : 1-123, 2-156, 3-160, 4-199, 5-199, 6-356, 7-365, 8-378, 9-406, 10-406.
భారత్ రెండో ఇన్నింగ్స్ : వీరేంద్ర సెహ్వాగ్ (సి) పీటర్సన్ (బి) స్వాన్ 25, పుజారా నాటౌట్ 41, విరాట్ కోహ్లీ నాటౌట్ 14, అదనపు పరుగులు 0, మొత్తం (15.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 80 పరుగులు.
ఇంగ్లండ్ బౌలింగ్ : అండర్సన్: 2-0-10-0, స్వాన్: 7.3-1-46-1, సమిత్ పటేల్: 6-0-24-0.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more