ఐపిఎల్ క్రికెట్ తరహాలో ఐబిఎల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగబోతున్నాయ్. అందుకోసం భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లను ‘ఐకాన్ ప్లేయర్స్’గా నియమించారు. ఈ ఐదుగురికి కనీస ధరగా 50 వేల డాలర్లు(రూ. 27 లక్షల 34 వేలు)గా నిర్ణయించారు. ప్రతి జట్టులో మొత్తం 11 మంది క్రీడాకారులు ఉంటారు. గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ప్రతి జట్టులో అండర్-20 విభాగానికి చెందిన ఒక క్రీడాకారుడు తప్పకుండా ఉండాలి. ఆటగాళ్ల ఒప్పందం ఐదేళ్లపాటు ఉంటుంది. ఫ్రాంచైజీ తరఫున రెండేళ్లపాటు ఆడాలి. ఐబీఎల్‌లోని పోటీలు సుదిర్మన్ కప్ తరహాలో జరుగుతాయి. ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు (పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) జరుగుతాయి. కేవలం విజేత, రన్నరప్ జట్లకు మాత్రమే ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేత జట్టుకు 65 శాతం; రన్నరప్ జట్టుకు 35 శాతం ప్రైజ్‌మనీ లభిస్తుంది. విజేత ఫ్రాంచైజీకి రూ.3 కోట్ల 50 లక్షలకుపైగా లభించే అవకాశముంది.
‘ఐకాన్ ప్లేయర్స్’ను మినహాయించి... వేలంపాటలో టాప్-10 ర్యాంకింగ్స్‌లోని విదేశీ ఆటగాళ్లకు కనీస ధరగా 25 వేల డాలర్లు; 11 నుంచి 25 ర్యాంకుల్లోపు వారికి 15 వేల డాలర్లు; 26 ఆపై ర్యాంక్ ఉన్న వారికి 5 వేల డాలర్లు నిర్ణయించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్-20లో ఉన్న భారత ఆటగాళ్ల కనీస ధర 20 వేల డాలర్లు ఉంటుంది. అంతర్జాతీయ భారతీయ క్రీడాకారులకు 10 వేల డాలర్లు; జాతీయ క్రీడాకారులకు 5 వేల డాలర్లు; జూనియర్ క్రీడాకారులకు 3 వేల డాలర్లు కనీస ధర ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more