దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ హాకీకి లేదని, అతి పురాతనమైన ఈ క్రీడ ఎంతో వెనుకబడిపోయిందని ఇండియన్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ హాకీ అసోసియేషన్ అధ్యక్షునిగా మన రాష్ట్రం నుంచి తాను మొదటిసారిగా ఎన్నికయ్యానన్నారు. జాతీయ క్రీడగా గుర్తింపు పొందిన హాకీ క్రీడకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. భారత హాకీ జట్టు ఇంతకుముందు ఒలింపిక్స్‌లో అనేక విజయాలను సాధించిందని, అయినప్పటికీ ఈ క్రీడకు ప్రోత్సాహం లభించడం లేదన్నారు. హాకీ జట్టులోకి యువకులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పాఠశాల స్థాయి పిల్లలకు ఈ క్రీడ పట్ల అవగాహన కల్పించనున్నామని దినేష్‌రెడ్డి వెల్లడించారు.
ఈనెల 25వ తేదీన జరిగే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సమావేశంలో హాకీకి సంబంధించిన అనేక అంశాలను చర్చించనున్నామని ఆయన చెప్పారు. హాకీ క్రీడ మరింతగా ఎదగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిని ఆ సమావేశంలో చర్చించి, తగు చర్యలు చేపడతామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అండర్-20 ఉమెన్ హాకీ టోర్నమెంట్‌ను ఈ నెలాఖరులో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాద్ పోలీస్ స్టేడియంలో టర్ఫ్ కోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more