ప్రపంచ కప్‌లో ఆడేందుకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. శ్రీలంకలో జరిగే ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీలకు ఎంపిక చేసిన 15 మందితో కూడిన భారత జట్టుకు యువరాజ్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్టర్లు ఎంపిక చేశారు. లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలతో పాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు కూడా ట్వంటీ 20 జట్టులో స్థానం లభించింది.క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
యువరాజ్ సింగ్ 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచులో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్ క్రీడకు దూరంగానే ఉన్నాడు. గతవారం ప్రాక్టీస్ గేమ్ ఆడాడు. బెంగళూర్‌లో అండర్ -19 ప్రపంచ కప్ ఆటగాళ్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో అతను బ్యాట్ పట్టాడు. క్యాన్సర్ వ్యాధికి అతను అమెరికాలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అలాగే న్యూజిలాండ్‌తో స్వదేశీ గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌ల్లో మొదటి రెండు టెస్టులకు కూడా సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు మ్యాచు ఈ నెల 23వ తేదీన హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 31వ తేదీ నుంచి చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more