ఒకప్పుడు ఒలింపిక్స్‌లో వరుసగా స్వర్ణాలు గెలిచిన ప్రతిష్ట... నేడు ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేని అప్రతిష్ట.ఒకప్పుడు ఒలింపిక్స్‌లో వరుసగా స్వర్ణాలు గెలిచిన ప్రతిష్ట... నేడు ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేని అప్రతిష్ట. పునర్‌వైభవం కోసం పాకులాడుతున్న భారత హాకీ జట్టు ప్రస్తుత పరిస్థితి ఇది. కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ లండన్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన టీమిండియా వరుసగా ఐదో పరాజయాన్ని చవిచూసింది. జరిగిన గ్రూప్-బి ప్రిలిమినరి లీగ్ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 0-3తో బెల్జియం చేతిలో ఓడింది. దీంతో తొలిసారి కనీసం ఒక్క పాయింట్ కూడా లేకుండా గ్రూప్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే ‘అన్ని పరాజయాల’ రికార్డును నమోదు చేసింది. గతంలో 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్ ఎనిమిదో స్థానంతో నిలవడం ఇప్పటిదాకా ఉన్న చెత్త ప్రదర్శన. ఇప్పుడు 11-12వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.... దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
బెల్జియం సర్కిల్‌లోకి పదేపదే దూసుకెళ్లిన భారత స్ట్రయికర్లు డిఫెన్స్‌ను ఛేదించడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో కేవలం రెండు పెనాల్టీ కార్నర్లే లభించినా వాటినీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరోవైపు భారత స్కోరింగ్ జోన్‌లో వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న బెల్జియం దీటైన ఆటతో ఆకట్టుకుంది. జెరోమ్ డెకియోసర్ (15వ.ని.), గుటియార్ బొకార్డో (47వ.ని.), టామ్ బూన్ (70వ.ని) గోల్స్ సాధించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆట 12వ నిమిషంలో బెల్జియం కొట్టిన తొలి పెనాల్టీ కార్నర్ కాగా... మరో రెండు నిమిషాల తర్వాత ప్రత్యర్థి సర్కిల్‌లోకి వెళ్లిన భారత్ గోల్ చేసే అవకాశాన్ని సృష్టించుకోలేకపోయింది. 21వ నిమిషంలో లభించిన పెనాల్టీని డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ వృథా చేయగా... 22వ నిమిషంలో సర్కిల్ నుంచి తుషార్ కొట్టిన రెండు షాట్లు గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లాయి. 34వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని శివేంద్ర జారవిడిచాడు. అతను కొట్టిన బంతి రీబౌండ్ కావడంతో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. 39వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీని సందీప్ మళ్లీ వృథా చేశాడు. ‘మేం బేసిక్స్ మరచిపోయాం. వాటిని మళ్లీ నేర్చుకోవాలి. ఆటగాళ్లకు మరింత మానసిక శక్తి కావాలి. మ్యాచ్... మ్యాచ్‌కీ మా ప్రదర్శన దిగజారింది. పదే పదే అవకాశాల్ని చేజార్చుకున్నాం’
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more