ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పేస్‌గన్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఈ పేసర్ తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్ లో కొనసాగుతానని అన్నాడు. 13 ఏళ్లపాటు ఆసీస్ జట్టుకు విశేష సేవలందించిన 35 ఏళ్ల బ్రెట్ లీ.. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగానే కెరీర్‌ను కొనసాగించలేకనే 'అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా అని అన్నాడు. ఈ 13 ఏళ్లూ అద్భుతంగా గడిచాయి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బ్రెట్ లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇక విరామ సమయంలో కుటుంబంతో గడుపుతానని చెప్పిన లీ.. షేన్ వార్న్, స్టీవ్ వా, మార్క్ వా, గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్ వంటి హీరోలతో కలిసి ఆడడం గొప్ప విషయమన్నాడు.
మ్యాచ్ విన్నర్‌గా పేరుగాంచిన బ్రెట్ లీ 76 టెస్టుల్లో 30.81 సగటుతో 310 వికెట్లు పడగొట్టాడు. 221 వన్డేల్లో 23.36 సగటుతో 380 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఆసీస్ తరపున మెక్‌గ్రాత్ (381) తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టింది బ్రెట్ లీనే. 25 టి-20 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు దక్కించుకున్నాడు. ఈనెల 7న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 2.2 ఓవర్లు మాత్రమే వేసిన బ్రెట్ లీ కాలిపిక్క పట్టేయడంతో పెవిలియన్‌కు చేరాడు. లీ కెరీర్‌లో ఇదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more