హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఈ హిల్ స్టేషన్... సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో వుంది. పర్వతారోహణ చేసేవారికి, అలాగే ట్రెక్కింగ్ యాత్రికులకు కూడా ఇది శీతల స్వర్గంగా ఉంటుంది. సుందరమైన ప్రకృతి, అందమైన పూల మొక్కలు, మంచుచే కప్పబడిన పర్వతాలకి ఈ ప్రదేశం ప్రసిద్ధి.