పవన ముక్తాసనం
ఈ ఆసనం వల్ల పొట్టలోని గ్యాస్ బయటకు విసర్జించబడుతుంది. ఉదర కండరాల పని తీరు మెరుగవుతుంది. ఛాతీ భాగం, భుజాలు, చేతుల నొప్పులు మటుమాయమవుతాయి. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ లోని మహిళలకు ఇది చాలా ఉపయోగం. కడుపు భాగంలోనే కాక, తొడలు, మోకాళ్ళ కండరాలు బలోపేతం చేస్తుంది.