వజ్రాసన
ఈ ఆసన వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తొడలు, కాలి పిక్కల కండరాలు ధృడంగా తయారవుతాయి. ఈ ఆసనలో.. మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉండాలి. కుడికాలుని మోకాలు వద్ద వుంచి పాదాన్ని కుడి పిరుదు క్రిందికు చేర్చాలి. అలాగే ఎడమ కాలుని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు క్రిందకు చేర్చాలి. రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకుని నడుము వంగకుండా నిటారుగా ఉండాలి. కళ్ళు పూర్తిగా మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాద్యమైనంత వరకూ బంధించి నిధానంగా వదలాలి.