If the land evaridi pattapas book

If the land evaridi pattapas book

If the land evaridi pattapas book

పట్టాపాస్ బుక్ ఉంటే భూమి ఎవరిది ?

Posted: 09/05/2013 05:38 PM IST
If the land evaridi pattapas book

నేనొక నేరం కారణంగా వరంగల్ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్నాను. మా తల్లిదండ్రులకు మేము ఇద్దరరం కుమారులం. నేను పెద్దవాడ్ని. అయితే 1964లో మా తాతగారు మా పక్కగ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే సమయంలో అప్పటి పట్వారితో పహానీ చేయించారు. కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో మాత్రం పహానీ కాలేదు. ఈ భూమి మా అమ్మ పేరు మీద పాస్ బుక్ తయార య్యింది. అయితే, 2002లో ఈ భూమిని మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నేను అడ్డుపడినా నా పై దాడి చేసి తిరిగి నా పైనే పోలీస్ స్టేషన్‌లోనే కేసు పెట్టి, మా అమ్మను బె దిరించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానిపై నేను కానీ, నా తమ్ముడు కానీ, భూమి అమ్మకానికి సంబంధించి సంతకాలేమీ చేయలేదు. ప్రస్తుతం ఆ భూమి వారి కబ్జాలోనే ఉంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సహాయం కోరి వినతి పత్రం పంపాను. కారాగారంలో ఉన్న ఈ స్థితిలో నా భూమి నాకు దక్కేలా కోర్టు వారు నాకేదైనా న్యాయ సహాయం అందించగలరా? ఆ వివరాలు తెలియచేయండి.


మీ తాతగారు కొనుగోలు చేసిన 6 ఎకరాల భూమిని న్యాయపరమైన రిజిస్టర్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేశారా? లేక సాదా కాగితం మీద రాయించుకుని కొనుగోలు చేశారా అన్న విషయాలేమీ మీరు తెలియచేయలేదు. తెలంగాణాలోని బాగా వెనుక బడిన గ్రామాల్లో నివసించే వ్యక్తులు ఈ వ్యవసాయ భూములకు సంబంధించిన లావాదేవీలన్నీ సాధారణ కాగితాలపైనే చేస్తుంటారు. వారు కొనుగోలు చే సిన ఆస్తిని అట్టి సాదా కాగితాన్ని, తమ గ్రామ పట్వారికి అందచేసి ఆ భూమిని అమ్మిన వ్యక్తి భయానా అంటే సాక్ష్యాన్ని ఆ అమ్మకం విషయమై ఇప్పించి, ఈ రివెన్యూ రికార్డుల్లో మార్పు చేయించుకుంటూ అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి కొన్ని సందర్భాల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నట్లు, ప్రభుత్వం గుర్తించి 1985లో ఇలాంటి రిజిస్టర్ కాని సాదా కాగితాల ద్వారా జరిగిన లావాదేవీలన్నింటిని క్రమబద్దీకరించాలన్న దృష్టితో ఒక కొత్త చట్టాన్ని తీసుకు వచ్చారు.

ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి సాదా కాగితం ద్వారా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అట్టి ఆస్తిని అనుభవిస్తున్నప్పుడు, అలా అనుభవిస్తున్నట్లు రివెన్యూ రికార్డుల్లో నమోదు అయినట్లయితే, సద రు వ్యక్తి ఆ సాదాకాగితాన్ని క్రమబద్దీకరించమని, దరఖాస్తు చేసుకుంటే , సంబంధిత తహసీల్దారు కార్యాలయం వారు వాటిపై అప్పటి మార్కెట్ విలువ ఆధారితంగా రుసుము వసూలు చేసి, రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఆ విషయమై తెలియచేస్తూ, వారి కొనుగోలును చట్టబద్దం చేస్తారు. మీ విషయానికొస్తే, మీ తాతగారు 1964లో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, పట్వారికి తెలియచేస్తే వారు తమ వద్ద ఉన్న పహానీలో నమోదు చేసినా, ఎంఆర్ఓ లేదా ప్రస్తుత తహసీల్దారు కార్యాలయంలో మాత్రం నమోదు కాలేదని తెలియచేశారు. ఆ విషయం తెలుసుకున్న మీ అమ్మగారు, మీ తాతగారి తదనంతరం తాను పట్వారి గారి వద్ద పహానీలో చేర్చి మీ అమ్మగారు పాస్‌బుక్ పొందినట్లుగా తెలియచేశారు. మీ అమ్మగారు ఒకవేళ తాను కొనుగోలు చేయకుండా, మీ తాతగారు కొనుగోలు చేసిన ఆస్తిని పట్వారి ద్వారా తన పేరును నమోదు చేయించుకుని పాస్‌బుక్కులు పొంది అట్టి ఆస్తికి తానే యజమానిగా చెప్పుకుని వేరే వ్యక్తికి అమ్మినట్లయితే, చట్టపరంగా ఆ అమ్మకం చెల్లదు. ఆ ఆస్తిని మీ తాతగారు 1964లోనే కొనుగోలు చేసినందువల్ల, మీ అమ్మగారు తన పేరు మీద న మోదు చేయించుకున్నంత మాత్రాన మీ అమ్మగారు ఆ భూమికి సంపూర్ణ యజమానురాలుగా గుర్తించబడదు.

తాను మీ అమ్మగారిని భయపెట్టి, రిజిస్టర్ చేయించుకుని, ఆ ఆస్తిని అనుభవిస్తున్నందువల్ల మీరు ఆ రిజిస్టర్ దస్తావేజును రద్దుపరచమని, ఆ దస్తావేజును ఎక్సిక్యూట్ చేసిన 3 ఏళ్లలోపలే దావా వేయాల్సింది. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి చట్టం దృష్టిలో న్యాయపరమైన హక్కుపత్రాలు పొందకుండా వేరే వారి భూమిలో ఆ పత్రాల ద్వారా ఆ ఆస్తిని స్వాదీన పరుచుకుని అనుభవిస్తున్నట్లయితే, ఆ ఆస్తిని మీకు తిరిగి దఖలు పరచమని, 12 ఏళ్లలోగా న్యాయస్థానాన్ని సంప్రదించవలసి ఉంటుంది. మీ అమ్మగారు మీ తాతగారి తదనంతరం 1997లో పట్వారి గారి ద్వారా తన పేరును నమోదు చేయించుకుని పాస్‌బుక్కులు పొంది 2002లో వేరే వారికి అమ్మిన ఆస్తిలో మీకు కూడా భాగం ఉందని మీ అమ్మగారు రాయించిన దస్తావేజు చెల్లదని ఆ ఆస్తి విషయంలో మీకు రావలసిన వాటాను మీకు అప్పగించమని కోరడానికి వెసులు బాటు ఉంది.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ వివరాలన్నీ తెలియచేస్తూ మీరు జిల్లా న్యాయస్థానంలోని న్యాయ సహాయక కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. కాకపోతే ప్రస్తుతం మీరు కారాగారంలో ఉండటం వల్ల దాని సూపరింటెండెంట్ ద్వారా దరఖాస్తు చేసినట్లయితే, జిల్లా న్యాయ సహాయక కేంద్రం వారు మీ అర్జీని పరిశీలించి న్యాయపరమైన మీ హక్కులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles