Women property rights

Women property rights

Women property rights

నాకు వాటా వస్తుందా ?

Posted: 05/17/2013 07:55 PM IST
Women property rights

నేను నా తల్లిదండ్రులకు రెండవ పుత్రికను. నాకు 1996 నవంబర్‌ 2వ తేదిన ప్రేమ పెళ్ళి జరిగింది. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఐదు ఎకరాల పొలం, రెండు ఇళ్లు కలవు. నాకు ఇద్దరు అన్నలు, ఒక అక్క కలదు. ఇప్పడు మా నాయన గారి ఆస్తిలో వాటా ఉంటుందా? లేదా ? దానికోసం నేను ఏమి చేయాలి ?


మీతాక్షర ధర్మశాస్త్రం ఆన్వయించే ఒక ఉమ్మడి కుటుంబంలో సహ కుటుంబీకుని కుమార్తె, ఆ కుటుంబంలో సహ కుటుంబ సభ్యురాలు అవుతుంది. ఆ క్రమంలో అమె సదరు సహ కుటుంబంలోని కుమారులతో సహనమవుతుంది. వారసత్వ ఆస్తికి వారితో పాటు సమాన హక్కుదారులవుతారు. కుమారులకు ఉండే హక్కులు, బాధ్యతలే కుమార్తెలకు ఉంటాయి. ఉమ్మడి కుటుంబ ఆస్తి పంపకం జరిగినప్పుడు కుమారులతో బాటు, కుమార్తెలకు సమాన వాటా లభిస్తుంది. అయితే భాగ పంపిణీ జరిగే సమాయానికి ముందుగానే కుమారులుగాని లేక కుమార్తెలు గాని ఎవరైనా చనిపోయి ఉండవచ్చు. అటువంటి సందర్భాలతో పంపిణీ జరిగే సమయానికి వారు జీవించి ఉన్నట్లయితే వారికి ఎంత వాటా లభిస్తుందో, ఆ వాటా వారి పిల్లలకు లభిస్తుంది.

అదే సందర్భములో భాగ పంపిణి జరిగే సమయానికి, అతడు ముందుగానే మరణించిన కుమారుని లేక కుమార్తె పిల్లలు కూడా మరణించినట్లయితే వారికి సంక్రమించవలసిన వాటా వారి పిల్లలకు సంక్రమిస్తుంది. క్లాజు (1) ద్వారా ఒక స్ర్తీకి సంక్రమించిన ఆస్తికి సర్వాధికారాలుంటాయి. నీవు సదరు ఆస్తిని వీలునామా ద్వారా గాని లేక మరేదైన ఆ జత పత్రి రూపంలోగాని యధేచ్చగా నీ యొక్క ఇష్టానుసారం వినియోగించవచ్చును. హిందూ వారసత్వ ఆంధ్రప్రదేశ్‌ సవరణ చట్టం, 1986కు పూర్వమే భాగ పంపిణి జరిగి, అప్పటికే వివాహం కాబడిన ఆడ పిల్లలకు ఈ క్లాజు వర్తించదు. అందువలన మీ యొక్క ఉమ్మడి ఆస్తి ఏమైనా ముందు పంపకాలు జరుగకుండా ఉండి మీరు చెప్పే విషయం నిజం అయినచో మీకు ఆస్తిలో వాటా వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles