ఈ వాదనలో నిజముందే : పుట్టినప్పుడు అందరూ ఒకటే... మానసిక స్థితి కారణంగా మేం ఈ విధంగా మారాం. ఆడ - మగ సాన్నిహిత్యాన్ని అంగీకరించగా లేనిది మమ్మల్ని మాత్రం ఎందుకు వేరు చేస్తున్నారు. అని సూటిగా ప్రశ్నించారు వారు. 'ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులున్నాయి. మాకు మాత్రం లేవు. మేం చేసిన తప్పేమిటి..?'' అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదటి సారిగా బయటకు వచ్చి ఓ భారీ ర్యాలీని నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించారు. వారే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్‌్ిజెండర్ మరియు క్వీర్ (ఎల్‌జిబిటిక్యు) కమ్యూనిటీ సభ్యులు.
దాదాపు 500 మంది వరకూ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని సురక్ష సొసైటీ, హీరోస్ ప్రాజెక్టు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలో స్థిరపడ్డ విదేశీయులతో పాటుగా ఆయా సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న గే, లెస్బియన్, బై సెక్సువల్స్, వారి సానుభూతిపరులు, ట్రాన్స్ జెండర్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఎల్‌జిబిటిక్యు వ్యక్తుల హక్కుల గురించి ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని సురక్ష సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
ర్యాలీ అనంతరం పీపుల్స్ ప్లాజా వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీరు నిర్వహించారు. పలు బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కమ్యూనిటీకి సంఘీభావం ప్రకటించిన గాయకుడు అనూజ్ గుర్‌వారా తన గానంతో అలరించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more