Full police protection for women in india

indian police, ap police, andhra pradesh police, delhi rape, gang rape case, andhra police, full police protection for women in india, women victims, film news, movie news

full police protection for women in india

25.gif

Posted: 02/06/2013 12:15 PM IST
Full police protection for women in india

a

       అబలలమీద అమానుషాలు మితిమీరి పోవటంతో మహిళలపై లైంగిక నేరాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. దీని అమలును పర్యవేక్షించే బాధ్యతను ఏడు కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు అప్పగించింది. వీరు కేబినెట్ కార్యదర్శి, ప్రధాని కార్యాలయానికి వ్యక్తిగతంగా నెలవారీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. తాజా ప్రణాళిక ప్రకారం... దేశంలో తొలుత ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లోని ఎంపిక చేసిన ఆస్పత్రులలో బాధితులకు సాంత్వన కలిగించేందుకు 'తక్షణ ప్రతిస్పందన కేంద్రాలు' ఏర్పాటవుతాయి. అలాగే వారికి పరిహారం అందించే ప్రత్యేక పథకాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అమలు చేస్తుంది.
       అత్యవసర పరిస్థితి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి 911 లేదా 990 నంబరు కేటాయించే అంశం పరిశీలనలో ఉంది. దీనికి ఫోన్ చేశాక బాధితుల వేదనను స్వీకరించాల్సిందే తప్ప మరో నంబరుకు చేయమనడం అనే మాటే ఉండదు. అంతేకాకుండా ప్రత్యేకించి మహిళల కోసమే 181 నంబరు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. నేర ప్రదేశంతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు స్వీకరించేలా పోలీస్ స్టేషన్లకు సరిహద్దులు తొలగిస్తారు. మహిళలపై వేధింపులతోపాటు తీవ్రమైన నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తర్వాత సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అజిత్ సేథ్ నిర్వహించిన అనేక సమావేశాల అనంతరం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ముందుగా పోలీసు, పాలన వ్యవస్థలను పటిష్ఠం చేస్తారు. మోటారు వాహనాల చట్టాన్ని సమీక్షిస్తారు. మహిళల కోసం ప్రత్యేక బస్సులను, టాక్సీలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. వీటిని సాధ్యమైనంత మేర మహిళలే నడిపేలా చూస్తారు. చట్టాల అమలు వ్యవస్థల జవాబుదారీతనాన్ని పెంచుతారు. ముఖ్యంగా దురుసుగా వ్యవహరించడం, గద్దించి ప్రశ్నించడం, సాక్ష్యమివ్వాలని బెదిరించడం వంటి వేధింపులకు తావు లేకుండా పౌరులెవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేలా రక్షణ కల్పిస్తారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ దోషులకు సంబంధించిన "నేర వివరాల సంకలనం'' నిర్వహిస్తూ వెబ్‌సైట్‌లో ఉంచబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gay and lesbian rally in hyderabad
Training for unemployed youth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more