Allu Arjun | Sarrainodu | Fans Worried | Trailer | Songs

Fans worried about sarrainodu

Allu Arjun Fans worried about Sarrainodu, Fans unhappy with Sarrainodu Trailer, Sarrainodu fans in tension, Sarrainodu re shooting, Sarrainodu release date, Sarrainodu latest trailers, Sarrainodu posters, Sarrainodu movie stills, Sarrainodu songs, Sarrainodu, Allu Arjun

Fans worried about Sarrainodu: Stylish star allu arjun upcoming film Sarrainodu will be release on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

‘సరైనోడు’ను టెన్షన్ పెడుతున్న ‘దమ్ము’

Posted: 04/15/2016 03:55 PM IST
Fans worried about sarrainodu

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న మాస్ చిత్రాల దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు బోయపాటి శ్రీను. ‘భద్ర’, ‘తులసి’, ‘దమ్ము’, ‘సింహా’, ‘లెజెండ్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించి, టాలీవుడ్ లో కమర్షియల్ మాస్ చిత్రాల డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

అలాంటి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సరైనోడు’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ థియేటర్ ట్రైలర్ మాత్రం బన్నీ అభిమానులను కంగారు పెడుతోంది.

కోటి రూపాయల ఖర్చుతో ‘సరైనోడు’ ఇంట‌ర్వెల్ బ్యాంగ్

‘సరైనోడు’ సినిమా థియేటర్ ట్రైలర్ లో వున్న యాక్షన్ సీన్లను చూస్తుంటే గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘దమ్ము’ చిత్రంలోని యాక్షన్ సీన్లు గుర్తొస్తున్నాయి. దీంతో ‘సరైనోడు’ చిత్రం కూడా ‘దమ్ము’ వలే ఫ్లాప్ అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ‘దమ్ము’ సినిమాలోని యాక్షన్ సీన్ల మాదిరిగానే తెరకెక్కించడంతో... ‘సరైనోడు’ యాక్షన్ సీన్లపై బన్నీ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ‘సరైనోడు’ చిత్ర యూనిట్.... కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను కొత్తగా డిజైన్ చేసి, రీషూట్ చేసారని తెలిసింది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా సినిమా పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. మరి ‘సరైనోడు’ సినిమాలోని పలు యాక్షన్ సీన్లు ‘దమ్ము’ సినిమాలోని సీన్లను రిపీట్ చేస్తాయో లేక కొత్తగా వుంటాయో అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ఇక అభిమానుల కోసం మరో కొత్త ట్రైలర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. ఈ ట్రైలర్ డైలాగ్స్, కామెడీ, పాటలు, యాక్షన్ సీన్లతో వుండేవిధంగా ఎడిటింగ్ చేసినట్లుగా తెలిసింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Fans Worried  Trailer  Songs  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more