జక్కన్నను టెన్షన్ పెడుతున్న అవతార్ | Baahubali tension with avatar

Baahubali tension with avatar

Baahubali tension with avatar, Baahubali vs Avatar, Baahubali film updates, బాహుబలి, అవతార్, Baahubali release date, Baahubali fight with Avatar, Avatar release date, ప్రభాస్, అనుష్క, తమన్నా Baahubali shooting updates, Baahubali

Baahubali tension with avatar: Director SS Rajamouli latest film Baahubali the conclusion. Prabhas, Rana, Anushka, Ramyakrishnan, Tamannah acts in lead roles.

బాహుబలిని టెన్షన్ పెడుతున్న అవతార్

Posted: 04/16/2016 05:12 PM IST
Baahubali tension with avatar

తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా ‘బాహుబలి2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

‘బాహుబలి2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలల విడుదల చేయడానికి ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘బాహుబలి2’ చిత్ర యూనిట్ కు ‘అవతార్’ టెన్షన్ పట్టుకుందట. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వలో రూపొందిన విజువల్ వండర్ ‘అవతార్’ చిత్రానికి సీక్వెల్ గా ‘అవతార్’ పార్ట్ 2 రూపొందనుంది. ‘అవతార్’ చిత్రానికి సీక్వెల్ గా నాలుగు పార్ట్ లు రాబోతున్నాయని దర్శకుడు జేమ్స్ కామెరూన్ తాజాగా ప్రకటించాడు.

2018లో మొదటి భాగం, 2020లో రెండవ భాగం, 2022లో మూడవ భాగం, 2023లో నాలుగవ భాగాలను విడుదల చేయాలనుకుంటున్నట్లుగా జేమ్స్ కామెరూన్ స్పష్టం చేసారు. అయితే ‘బాహుబలి’ చిత్రాన్ని కూడా రెండు, మూడు పార్ట్ లుగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శకుడు రాజమౌళి మరియు చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇపుడు ‘అవతార్’ సీక్వెల్ ల వలన ‘బాహుబలి’ సీక్వెల్ కు గట్టి పోటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ‘అవతార్’ చిత్రం విజువల్స్, గ్రాఫిక్స్ అంశాలతో రూపొందనుంది. ‘బాహుబలి’ చిత్రం కమర్షియల్, ఎమోషనల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ‘అవతార్’ తర్వాత ‘బాహుబలి’ చిత్రం విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తప్పవని ‘బాహుబలి’ చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Avatar  Prabhas  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more