Nagarjuna | Mythri Remake | Soggade Chinninayana

Nagarjuna in kannada mythri remake

Nagarjuna in Mythri Remake, Nagarjuna comments on Mythri Movie, Nagarjuna in kannada mythri remake, Nagarjuna in mythri remake, Nagarjuna in kannada remake, Nagarjuna in kannada mythri, Mythri remake, Nagarjuna in remake movie, Nagarjuna latest news, Nagarjuna movie news, Nagarjuna movie updates, Nagarjuna

Nagarjuna in Kannada Mythri Remake: Nagarjuna is looking to work in the remake of Kannada film Mythri. Nagarjuna latest movie soggade chinni nayana.

నాగార్జున మైత్రి రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు

Posted: 04/11/2015 11:48 AM IST
Nagarjuna in kannada mythri remake

కన్నడంలో విజయం సాధించిన ‘మైత్రి’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ‘మైత్రి’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత ఎన్.ఎస్.రాజ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో నాగార్జున నటించబోతున్నాడని వార్తలొచ్చాయి. నాగార్జున కోసం ప్రత్యేకంగా స్పెషల్ షో ను ఏర్పాటు చేసారు. ‘మైత్రి’ చూసిన తర్వాత చిత్ర యూనిట్ ను అభినందించారు నాగార్జున. కానీ ఈ సినిమా రీమేక్ గురించి ఎలాంటి వివరాలు తెలియజేయలేదు.

అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. నాగార్జున స్నేహితుడైన జి.కె. ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఇందులోని ఓ కుర్రాడి పాత్ర కోసం హీరో శ్రీకాంత్ తనయుడిని ఎంపిక చేసినట్లుగా తెలిసింది. కన్నడంలో మోహన్ లాల్ చేసిన పాత్రలో నాగార్జున నటిస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం... పునీత్ రాజ్ కుమార్ పాత్రలో నాగార్జున నటించనున్నాడని తెలిసింది. మరి మోహన్ లాల్ పాత్రలో ఏ అగ్ర నటుడు నటించనున్నాడో త్వరలోనే తెలియనుంది.

ఈ చిత్ర రీమేక్ కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నాగార్జున ప్రస్తుతం PVP బ్యానర్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ‘సొగ్గాడే చిన్నినాయన’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘సొగ్గాడే చిన్నినాయన’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Mythri Remake  Soggade Chinninayana  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more