Roja daughter anshu malika film industry entry news

roja news, mla roja news, roja daughter anshu malika, anshu malika photos, roja daughter news, roja daughter debu news, roja daughter movie debut news, roja daughter photos, roja daughter anshu news

roja daughter anshu malika film industry entry news : Actress nagari ysrcp mla roja daughter is ready to enter in film industry.

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న బుల్లిరోజా..?

Posted: 03/11/2015 02:47 PM IST
Roja daughter anshu malika film industry entry news

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న ‘బుల్లిరోజా’ ఎవరా అని సందేహంలో మునిగిపోయారా..! ఆ అమ్మాయి మరెవరో కాదు.. నటి, నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాళిక. ఇప్పటికే ఈ అమ్మాయి బుల్లితెరపై బాలనటిగా మంచి గుర్తింపు సాధించింది. ఇక త్వరలోనే ఈమె వెండితెరపై రానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోజా తన కుమార్తె అన్షు మాళికతో కలిసి వున్న ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో, మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ ఫోటోలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ ఫోటోలను వీక్షించిన కొందరు దర్శకనిర్మాతలు.. 12 ఏళ్ల అన్షు మాళికను సినిమాల్లో నటించపచేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట! ఈ నేపథ్యంలోనే కొందరు దర్శకనిర్మాతలు రోజాను సంప్రదించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రోజా తన కుమార్తెను బాలనటిగా వెండితెరపై పరిచయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. మరి.. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే!

ఇదిలావుండగా.. నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయికగా పేరుగాంచింది. ఈమె నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే తనను తమిళ తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఆర్‌కె సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి, గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roja news  anshu malika  roja daughter anshu malika  tollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more