Mahesh babu koratala shiva problems reason

mahesh babu koratala shiva movie updates, mahesh babu movie problems, jagapati babu back pain problem, jagapati babu health update, sruti hassan in mahesh movie latest update, mahesh koratala shiva movie resume, tollywood latest news updates

mahesh babu koratala shiva problems reason : super star mahesh babu koratala shiva movie facing problems with heroine and villian, some of tollywood persons says that because of mahesh babu faced opening shot of movie by changing his sentiment

సెంటిమెంట్ మారింది.., ఏకంగా సినిమా ఆగింది

Posted: 12/06/2014 03:00 PM IST
Mahesh babu koratala shiva problems reason

‘అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని’ ఓ సినిమాలో అల్లు అర్జున్ చెప్పాడు. మహేష్ కు కూడా ఇలాగే అవుతోంది. కొద్దికాలంగా సూపర్ స్టార్ ను వరుసగా సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కాగా.., తాజా సినిమా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇన్ని రోజులు హీరోయిన్ లేక షూటింగ్ ఆగిపోగా., ఇప్పుడు విలన్ వల్ల ఆలస్యం అవుతోంది. వీటివల్ల మహేష్ ఇబ్బందిడుతుండగా.., మరోవైపు కష్టాలకు ఆయనే కారణం అని గుసగుసలు విన్పిస్తున్నాయి.

సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే హీరోల లిస్ట్ లో మహేష్ కూడా ఉంటాడు. సినిమాలో స్ర్కిప్టులతో పాటు.., సెంటిమెంట్లు కూడా చూసుకుంటాడు. టైటిల్ మూడు అక్షరాలతో పాటు చివర ‘డు’ వచ్చేలా ఉండటం ఈ సెంటిమెంట్ లో భాగమే. అంతేకాకుండా సినిమాలో తొలి షాట్ ను తనపై తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే ‘ఆగడు’ విషయంలో ఈ సెంటిమెంట్ బెడిసికొట్టింది. దీంతో ఆయన నమ్ముకునే సెంటిమెంట్లు కొన్నిటిని మార్చేశాడు. తొలి షాట్ ను తనపైనే తీయించుకున్నాడు. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మహేష్ మారిపోయాడు అని తెగ చర్చ జరిగింది.

ఈ సెంటిమెంట్ సూపర్ స్టార్ ను ఆదుకోవటం అటుంచితే.., సినిమాకు మాత్రం ఇబ్బంది కల్గిస్తోందని గుసగుసలు విన్పిస్తున్నాయి. తొలి షాట్ ను తనపై తీయించుకోవటం వల్లే సినిమాకు ఇలా ఇబ్బందులు వస్తున్నాయని కొందరు జోకులేసుకుంటున్నారు. ఇక సినిమా ఇబ్బందులపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటి ఇచ్చాడు. హీరోయిన్ వచ్చే వారం షూటింగ్ లో జాయిన్ అవుతుందని చెప్పాడు. ఇక వయసు రిత్యా వచ్చే సమస్యల్లో ఒకటైన వెన్నునొప్పి నుంచి జగపతి త్వరలోనే కోలుకుంటాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu movie problems  koratala shiva latest  jagapati babu health  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more