టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు కొంతకాలంగా అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘1 నేనొక్కడినే’ సినిమా ఫెయిల్ కాగా.., లేటెస్ట్ గా వచ్చిన ‘ఆగడు’ కూడా ఫ్లాపు అయింది. ఇక హాలిడే టూర్ కు వెళ్ళి వచ్చి ఫ్రెష్ మైండ్ తో కొరటాల శివతో సినిమా మొదలు పెడితే ఇబ్బందులు క్యూలో వచ్చిమరీ సినిమాను అడ్డుకుంటున్నాయి. సినిమా తొలి షెడ్యూల్ పూణేలో మొదలు పెట్టగా హీరోయిన్ శృతి హాసన్ మద్యలోనే చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. విజయ్ పిలుస్తున్నాడంటూ వెళ్ళిన అమ్మడు ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ దెబ్బకు అంతా ప్యాకప్ చెప్పేసుకుని హైదరాబాద్ కు వచ్చేశారు.
తాజాగా మూవీకి మరో ఇబ్బంది కలుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ గా నటిస్తున్న జగపతిబాబు వెన్నునొప్పితో బాధపడుతున్నారట. షూటింగ్ సమయంలో నొప్పి వస్తుండటంతో సన్నివేశాలకు చాలా టేకులు తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని టాక్ వస్తోంది. జగపతి ఆరోగ్యం గురించి కామెంట్ చేయటం సరైన పద్దతి కాదు. అయితే ఇది మహేష్ ను చాలా ఇబ్బంది పెడుతోంది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఆటంకాలు వస్తుండటంతో సినిమా పూర్తవుతుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ మద్య ఓ పేపర్ కు ఇంటర్య్వూ ఇచ్చిన మహేష్ బాబు.., తన చిన్ననాటి అనుభవాలు ఇతర పర్సనల్ విషయాలను బయటకు చెప్పాడు. ఇదే సమయంలో పొలిటికల్ ఎంట్రీపై మరోసారి కామెంట్ చేశాడు. ప్రస్తుతం దేశానికి చాలా సమస్యలు ఉన్నందున తాను రాజకీయాల్లోకి చేరి మరో సమస్య కాకూడదని భావిస్తున్నట్లు చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదనీ.., దానికి బదులు అవసరంలో ఉన్న చిన్నారులకు తోచిన సాయం చేస్తానని చెప్పాడు. ఇలా చాలామంది నేతలు కామెంట్ చేసినా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు..., ప్రిన్స్ విషయంలో ఏం జరుగుతుందో కాలమే చెప్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more