దేవుడి పేరుతో సినిమా తీస్తే ఆయన ఆశీర్వాదం ఉంటుందనుకున్న రజినికి అంతా రివర్స్ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లింగా సినిమా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. గతంలో ఈ మూవీ కథ తనదే అని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.., విచారించిన కోర్టు కేసును కొట్టేసింది. గొడవ ముగిసింది అనుకునేలోపు మరో కేసు పడింది. ఈ సారి కూడా ‘లింగా’ కథను రవికుమార్ కాపి కొట్టాడు అని కేసు దాఖలయింది. రచయత శక్తివేల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సినిమా మళ్లీ వివాదంలో పడింది.
పిటిషన్ వివరాల ప్రకారం. ‘ముళ్ళై పెరియార్’ డ్యాం నేపథ్యంగా తాను ఓ కథ రాసుకుని దాన్ని 2012 సంవత్సరంలో నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేయించానని చెప్పాడు. పలువురు హీరోలు, ప్రొడ్యూసర్లకు చెప్పినా.., భారీ బడ్జెట్ పెట్టలేము అని చెప్పటంతో సైలెంట్ అయ్యానన్నారు. ఇంతలోనే రవికుమార్ తన కథతో సినిమా తీశారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వాడుకుని తీసిన సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు డైరెక్టర్ రవికుమార్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు నోటిసులు పంపింది.
సినిమా విడుదలకు ముందు ఇలా ఇబ్బందులు ఎదురుకావటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుసగా కేసులు పడుతుండటంతో రవికుమార్ సొంతంగా రాసుకున్నాడా., లేక కాపి కొట్టాడా అని అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కథ తీసుకోవాలనుకుంటే వారిని పిలిచి డబ్బులు ఇచ్చి తీసుకునేవాడు కానీ ఇలా వివాదాలు తెచ్చుకునే స్వభావం ఆయనది కాదు అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ‘కత్తి’ సహా ఇతర సినిమాల కథలపై కూడా ఇలాగే వివాదాలు వచ్చాయి. మరి ఈ మూవీ కేసుల గొడవ ఎటు వెళ్తుందో కోర్టు తేల్చనుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more