హిందీ సినీ హీరో, కండల వీరుడుగాను, హిందీ సినీ పరిశ్రమలో ఎక్కువ మందితో సన్నిహిత సంబంధమున్నట్లుగానూ పేరుగాంచిన సల్మాన్ ఖాన్ తనికి పెళ్ళిచేసుకోనంటున్నాడు. వరుసగా సినిమాలలో విజయం సాధిస్తూ వస్తున్న సల్మాన్ ఖాన్ తన శరీరాన్ని తీర్చి దిద్దుకునే పనిలో పడి, హీరోయిన్లతో చెలిమికి ప్రాధాన్యనిస్తూ పెళ్ళి సంబంధాల వైపు దృష్టి పెట్టక ముదిరిన బ్రహ్మచారయ్యాడు.
5 సందర్భాల్లో సల్మాన్ పెళ్ళి చేసుకుంటాడనే అందరూ అనుకున్నారు కాని అవేమీ ముందుకు సాగలేదు. ఈ విషయంలో టివి ఇంటర్వ్యూలో మాట్లాడిన సల్మాన్ ఖాన్ తను బహుశా జీవితంలో పెళ్ళి చేసుకోకపోవచ్చునని స్పష్టంగా తెలియజేసారు. ఈ ఇంటర్వ్యూ డిడి న్యూస్ లో 27 రాత్రి 9.30 ప్రసారమైంది. తిరిగి ఆదివారం రాత్రి 11.30 కి రిపీట్ అయింది.
ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తో సన్నిహితంగా మెలగటం అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ ని సల్మాన్ పెళ్ళి చేసుకుంటాడనే అందరూ అనుకున్నారు. ఐశ్వర్యని ఏమైనా అంటే సల్మాన్ కి కోపం వస్తుందని కూడా సినీ పరిశ్రమలో జోక్ లు వేసుకుంటుండేవారు. సల్మాన్ అభిమానులు కూడా ఆ శుభవార్త వినటానికి ఎదురు చూసారు. కానీ అది అవలేదు. రొమేనియన్ సుందరి లూలియా వంటూర్ ని ప్రేమించానని, త్వరలో పెళ్ళి చేసుకుంటానని అన్నాడు. కానీ ఆమె గ్రామీ అవార్డ్ కి నామినేట్ అయిన మ్యూజిషియన్ ని పెళ్ళి చేసుకుంటానని ప్రకటించింది. కత్రినా కైఫ్ తో స్నేహం ముదురుతోందని, పెళ్ళికి దారితీస్తుందని అందరూ అనుకున్నారు వాళ్ళిద్దరి జోడీ బాగుంటుందని కూడా అభిమానులంతా ఆశపడ్డారు. కానీ ఎందుకో ఇద్దరూ గొడవపడి విడిపోయారు. నటి సంగీతా బిజ్లానీ తో సల్మాన్ ఖాన్ కి పెళ్ళవుతుందని పుకార్లు వచ్చాయి. కానీ ఆమె క్రికెటర్ అజారుద్దీన్ ని పెళ్ళి చేసుకుంది. ఆందోళన్, తీస్రా కౌన్ లో నటించిన సోమి అలితో సల్మాన్ ఖాన్ స్నేహం కొంతకాలం సాగింది కానీ ఆమె యుఎస్ కి వెళ్ళిపోయి అక్కడ చిన్నపిల్లల కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు సల్మాన్ కూడా తనిక సమాజసేవలో చిన్న పిల్లల సంక్షేమం కోసం పాటుపడతానని, చిన్నపిల్లలకు సేవచేసుకుంటూ జీవితమంతా గడిపేస్తానంటున్నాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more