Kick hindi movie colelctions salman khan proximity to modi

Kick Hindi movie collections, Salman Khan proximity to Modi, Salman Khan latest movie Kick, Ravi Teja acted Kick remade in Hindi

Kick Hindi movie collections Salman Khan proximity to Modi: Rumours about Kick movie collection dropped due to Modi

మోదీ వలన కిక్ కలెక్షన్లు దెబ్బతిన్నాయా?

Posted: 07/27/2014 03:11 PM IST
Kick hindi movie colelctions salman khan proximity to modi

రవితేజ నటించిన తెలుగు కిక్ సినిమాకి హిందీ రూపాంతరమైన సల్మాన్ ఖాన్ నటించిన కిక్ సినిమా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వలన దెబ్బతిన్నదిన్న వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది.

సల్మాన్ ఖాన్ ని నరేంద్ర మోదీకి చేరువలో చూసిన ముస్లింల వలన కిక్ సినిమా కలెక్షన్లు దెబ్బతింటున్నాయని కొందరి భావన.  జయ్ హో హిందీ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్ మోదీని కలవటం జరిగింది.  మోదీ వెబ్ సైట్ ని ఉర్దూలో ప్రారంభించటానికి సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తోడ్పడ్డారు.  మోదీ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా సల్మాన్ ఖాన్ హాజరవటం జరిగింది.  ఈ సంఘటనల వలన సల్మాన్ ఖాన్ సినిమాని ముస్లింలు చూడటానికి పోవటం లేదన్నది వాళ్ళ వాదన.  

అంటే హిందీ సినిమాలు చూసేవాళ్ళంతా సల్మాన్ ఖాన్ ముస్లిం కాబట్టి చూస్తున్నారా.  మోదీని కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో సల్మాన్ ఖాన్ స్పష్టంగా తాను మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బాబా సిద్దిక్వికి వోటేస్తానని మోదీ సమక్షంలోనే చెప్పటం జరిగింది.  తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వోటు వేస్తానని, అది తన అభిప్రాయమని, మోదీ సమర్థుడనుకుంటే మిగతావాళ్ళు ఆయనకే వోటెయ్యవచ్చని సల్మాన్ ఖాన్ ఆ రోజు చెప్పారు.  

salman-modi-press

కేవలం ముస్లిం యువత చూస్తేనే సల్మాన్ ఖాన్ సినిమాలు ఆడుతాయన్నది, మోదీతో సల్మాన్ ఖాన్ ని చూసినంత మాత్రాన అతని ముస్లిం అభిమానులు ఆయన సినిమాని చూడటానికి పోరనేది అర్థం లేని వాదన.  పైగా ముస్లింలంతా మోదీకి వ్యతిరేకులు కారని 2014 ఎన్నికలు తెలియజేస్తున్నాయి.  

రంజాన్ రోజులు, ఈద్ దగ్గర్లో ఉంది కాబట్టి ముస్లింలలో పెరిగిన భక్తి ప్రపత్తులతో ఇస్లాం మీద అభిమానం ఎక్కువగా ఉండటం సహజమే కానీ దానికీ సినిమాకి సంబంధం లేదు.  పోనీ సినిమాలో ఇస్లాంకి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే అనుకోవచ్చు కానీ సామాన్యమై యాక్షన్ ఫిల్మ్ చూడటానికి, అందులో హీరోని ప్రధానమంత్రికి సమీపంలో చూడటానికి ఏమైనా సంబంధం ఉంటుందా? 

అన్నిటికన్నా ముఖ్యంగా కిక్ విడుదలైన రోజున 26.4 కోట్లను వసూలు చేసింది, ఆ తర్వాత రెండు రోజుల్లోను 50 కోట్లకు పడగలెత్తింది.  ఇంతకన్నా సినిమానుంచి ఆశించేదేముంటుంది ఎవరికైనా.  ధూమ్ 3 36.32 కోట్లను, చెన్నై ఎక్స్ ప్రెస్ 33.12 కోట్ల రూపాయలను వసూలుచేస్తే వాటికి కంటే ఎంతో ఎక్కువ వసూళ్లైన 50 కోట్ల రూపాయలతో పోల్చి చూస్తే కిక్ కలెక్షన్లు పడిపోయినట్లా?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more