మెగాస్టార్ చిరంజీవి గత ఐదు సంవత్సరాల్లో రాజకీయాల్లో అసలిపోయి, కాదు కాదు కాంగ్రెస్ పార్టీకి కనీస సీట్లు కూడా రాకుండా పోవడంతో ఈయనకు పనిలేకుండా పోయింది. దీంతో ఆయన మనస్సు సినిమాల పై పడింది. తన కెరియర్లో బ్యాలెన్స్ ఉండిపోయిన 150 చిత్రాన్ని పూర్తి చేస్తానని చెప్పిన ఆయన కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు.
ఈయన 150 సినిమాకు దర్శకత్వం వహించే దర్శకుడు ఎవరు ? అనే దాని పై ఇండస్ట్ర్రీలో పలు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో దర్శకుడు ఈ జాబితాలోకి వచ్చి చేరాడు. నిన్న విడుదల అయిన ‘మనం ’ సినిమా చూసిన చిరంజీవి ఆ సినిమా దర్శకుడు విక్రం కె. కుమార్ కి అభినందనలు తెలపడమే కాకుండా, ఓ మంచి కథ ఉంటే చెప్పుమని కూడా మెసేజ్ పాస్ చేశాడట.
‘మనం ’ సినిమా దర్శకత్వానికి ముగ్దుడైన చిరు మెగా క్యాంప్ కోసం ఓ సినిమా ప్లాన్ చేయమని సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అలా వీలు కాకపోతే తాను చేయబోయే 150 సినిమాకైనా దర్శకుడడిగా పెట్టుకోవాలని చిరు ఆలోచనలో ఉన్నట్లు సినిమా వర్గాల సమాచారం. ఒక వేళ చిరుకి కథ నచ్చే విధంగా చెబితే ఈ దర్శకుడి స్టార్ డమ్ రాత్రికి రాత్రే అందలం ఎక్కడం ఖాయం.
వాస్తవానికి విక్రం కుమార్ చెర్రీకి ఎప్పుడో కథ వినిపించినా ఆయన్ను పట్టించుకోకోలేదు. ఇఫ్పుడు హిట్ సినిమా తీయడంతో మెగా హీరోలు విక్రం కుమార్ జపం చేస్తున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి చిరు సైడ్ నుంచి విక్రమ్‌కి ఓకే స్టాంప్ పడిందని ఫిలింనగర్ టాక్.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more