More space in the hearts of heroines

More space in the hearts of heroines, Alia Bhat, Ranbir Kapoor, Arjun Kapoor, Katrina Kaif, Salman Khan

More space in the hearts of heroines, Alia Bhat, Ranbir Kapoor, Arjun Kapoor, Katrina Kaif, Salman Khan

హీరోయిన్లకు పెరుగుతున్న హృదయ వైశాల్యం!

Posted: 04/07/2014 03:25 PM IST
More space in the hearts of heroines

కొత్తగా వస్తున్న హీరోయిన్ల హృదయ వైశాల్యానికి హద్దు లేదని అర్థమౌతోంది.  2 స్టేట్స్ చిత్రంలో సహజత్వానికి చేరువలోకి వెళ్ళి దర్శకుని అభిలాషలకు అనువుగా నటించిన ఆలియా భట్ స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా హీరో అర్జున్ కపూర్ తో కేమెరా ముందు సన్నిహితంగా నటించటమే కాకుండా సినిమా ప్రొమోలలో కూడా ఒకరికొకరైన జంటగా వ్యవహరించారు. 

అయితే గుండె చిన్నదైనా గూడు పెద్దదే అన్నట్లుగా రణబీర్ కపూర్ అంటే తనకి చచ్చేంత ప్రేమని ఆలియా భట్ మీడియా ముందు చెప్పుకొచ్చింది.  అంతేనా, తనది ఒక వైపు నుంచి మాత్రమే పెల్లుబుకుతున్న ప్రైమైనా, పెళ్ళి చేసుకోవటం జరిగితే మాత్రం అతనితోనే అంటోంది!  "ఈ విషయాన్ని మరి అతనికి చెప్పి, అతని తల్లిదండ్రుల దగ్గరకు సాంప్రదాయబద్ధంగా తీసుకెళ్ళకపోయారా?" అని మీడియా ప్రతినిధులు అడిగిన దానికి, "ఈ కాలంలో వార్తలు అడవిలో నిప్పులా చకచక వ్యాపిస్తుంటాయి కాబట్టి అందరికీ అన్ని విషయాలు చాలా త్వరగా తెలిసిపోతుంటాయి! ఇప్పుడు నేను చెప్పింది కూడా టివిలోకి వార్తలా వచ్చేస్తుంది ఈ కాలంలో అందరూ టివిలు చూస్తునేవుంటారు కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి ఎవరికీ ఏమీ చెప్పనక్కర్లేదు" అని అందామె. 

ఇక రణబీర్ కపూర్ విషయానికి వస్తే, విపరీతమైన ఫ్యాన్స ఉన్న రణబీర్ తలమునకలుగా దేశంలో అత్యంత శృంగారభరితమైన విగ్రహంగా మార్కులు కొట్టేసిన కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు.  మరి టివిలో అది కూడా కనిపించేవుండాలిగా అందరికీ.  అయినా ఆలియా భట్ కి అది తెలియనట్లుగానే ప్రవర్తిస్తోంది. 

ఇక కత్రినా కైఫ్ కూడా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియని అమాయకురాలు అమ్మాయేమీ కాదు.  కండల కుర్రవాడు సల్మాన్ కి మంచి ఆడ స్నేహితురాలిగా మంచి పేరు సంపాదించుకున్న జాణామణే.! 

అందువలన సినిమా నటీనటులకు ఇరుకు గుండె ఏ మాత్రం లేదని, వారి హృదయంలో ఎంతో మందికి చోటుంటుందని, పుష్పక విమానంలో లాగా ఎంతమంది ప్రవేశించినా మరొకరికి చోటుంటుందని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు!

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more