Dilemma in mega brothers fans

Dilemma in mega brothers fans, Chiranjeevi, Pawan Kalyana, Pawan Kalyan political party, Pawan kalyan Janasena, Pawan Kalyan Ism book on politics

Dilemma in mega brothers fans, Chiranjeevi, Pawan Kalyana, Pawan Kalyan political party, Pawan kalyan Janasena, Pawan Kalyan Ism book on politics

మెగా అభిమానుల సందిగ్ధావస్థ

Posted: 04/02/2014 10:45 AM IST
Dilemma in mega brothers fans

మా చిన్నప్పుడు మా పిన్నివాళ్ళ పిల్లలతో మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం.  అయితే మా అమ్మ, పిన్ని మధ్య గొడవలు వస్తుండేవి.  అప్పుడు మేము మాట్లాడుకోవాలా వద్దా అన్నది తెలియక సందిగ్ధంలో ఉండిపోయేవాళ్ళం.  బయట స్కూల్లో కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం.  అల్లంత దూరంలో ఇల్లు కనపడగానే విడిపోయి ఒకళ్ళనొకళ్లు గుర్తుపట్టనట్టుగా ఉండేవాళ్ళం. 

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సినీ అభిమానుల పరిస్థితి కూడా, కొందరు పేరు పైకి చెప్పటం ఇష్టం లేని అభిమానులు చెప్పినదాని ప్రకారం, అలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది.  ఎందుకంటే వాళ్ళ అభిమానం సినిమాల వరకే పరిమితమవకుండా రాజకీయరంగంలోకి కూడా అడుగుపెట్టటం జరిగింది.   

అనంతపూర్ లో కాంగ్రెస్ బస్ యాత్రలో మాట్లాడుతున్న చిరంజీవి ఉపన్యాసానికి అడ్డు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయనకి కోపాన్ని తెప్పించింది.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా సింగ్ మంగళవారం నాడు చిరంజీవి అభిమానులందరికీ చిరంజీవి సమక్షంలోనే పార్టీ సభ్యత్వం తీసుకోమని, నాయకులుగా గుర్తింపుని పొందమని, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రాతినిధ్యానికి పోటీ చెయ్యమని పిలుపునిచ్చారు. 

అలాగే పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకం గురించి వ్యాఖ్యానిస్తూ అందులో మానవీయ దృక్పథం లేదని చిరంజీవి అన్నట్లుగానూ, అందుకు సమాధానంగా, రామాయణాన్ని కూడా విమర్శించేవారుంటారు, ఎవరి అవగాహన వారిది అని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఒక టివి ఛానెల్ ప్రసారం చేసింది.  ప్రశ్నించటానికే పుట్టిన జనసేన పార్టీ తరఫున అవసరమైతే చిరంజీవిని కూడా ప్రశ్నించటం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారని కూడా ఆ ఛానెల్ తెలియజేసింది.

ఇది నిజంగా మెగా అభిమానులకు పరీక్షే.  ఒకరిని అభిమానించటమంటే మరొకరిని ద్వేషించటం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలను అభిమానిస్తాం కాని ఆయన రాజకీయాలను కాదని చిరంజీవి అభిమాన సంఘం లోగడ ప్రకటించటం జరిగింది. 

కానీ ఆ పరిస్థితి కూడా మారిపోతూ కనిపిస్తోంది.  ఎందుకంటే చిరంజీవి కుటుంబ సభ్యులంతా చిరంజీవికే మద్దతును ప్రకటిస్తున్నారు.  దానితో పవన్ ఒంటరైపోయాడనే భావన కలుగుతోంది.  అందువలన అభిమాన సంఘాలలో చీలికలు కూడా ముందు సిద్ధాంత పరంగా ఉన్నట్లుగా ఉన్నా, మరుగునపడివున్నా, అవి ఇప్పుడు బాహాటంగా విభజనకు చోటుచేసుకుంటున్నాయి. 

కానీ గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం చేత్తో తీసిపారేసేది కాదు కాబట్టి, వ్యాపార వాణిజ్య రాజకీయ రంగాలకు అతీతం కాబట్టి, ఇద్దరి మీదా అభిమానం ఉన్నవాళ్ళ మనసులు మాత్రం ముక్కలౌతున్నాయి.  రెండుగా కాదు- చిన్నచిన్న ముక్కలుగా!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more