Preeti Jain Convicted For Plot To Kill Bollywood Top Director

Preeti jain sentenced for plotting to kill madhur bhandarkar

Director Madhur Bhandarkar, Preeti Jain, Prreti Jain Rape Case, Preeti Jain Convict, Preeti Jain Arrest, Preeti Jain Madhur Bhandarkar, Madhur Bhandarkar Rape Case, Madhur Bhandarkar Model, Madhur Bhandarkar Case, Madhur Bhandarkar Twitter, Preeti Jain, Mumbai Model Top Director, Bollywood Top Director Murder Plan, Model Director, Madhur Bhandarkar Murder Attempt, Preeti Jain Try Kill

Mumbai model Preeti Jain sentenced to 3-year imprisonment for conspiring to kill film director Madhur Bhandarkar.

మోడల్ ప్రీతి జైన్ కు మూడేళ్ల జైలు శిక్ష

Posted: 04/28/2017 04:04 PM IST
Preeti jain sentenced for plotting to kill madhur bhandarkar

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ను హత్య చేయించడానికి కుట్ర పన్ని న కేసులో మోడల్ ప్రీతి జైన్ కు ఎట్టకేలకు శిక్ష పడింది. ప్రీతిని దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో సాయపడ్డ శివరామ్ దాస్, నరేష్ పరదేశీ లకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

2005లో ఫ్యాషన్, హీరోయిన్ చిత్రాల డైరక్టర్ మధుర్ భండార్కర్ ను హత్య చేయించే నిమిత్తం గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశీతో ఒప్పందం చేసుకుని, అతనికి రూ.75 వేల రూపాయలు ఇచ్చింది. అయితే, భండార్కర్ ను హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా ప్రీతి డిమాండ్ చేసింది. ఈ విషయం అరుణ్ గావ్లీకి తెలియడంతో పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశాడు. దీంతో, ప్రీతిపై, ఆమెకు సహకరించిన నరేష్, శివరామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ దోషులని కోర్టులో తేలడంతో శిక్ష పడింది.

మరోవైపు 2006లో దర్శకుడు భండార్కర్ పై ప్రీతి రేప్ కేసు పెట్టింది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే, 2012లో ఈ ఫిర్యాదును ప్రీతి ఉపసంహరించుకోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది.రేప్ కేసు పెట్టినందుకు గానూ మరో 10,000 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు తీర్పుపై మధుర్ బండార్కర్ తన ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Director Madhur Bhandarkar  Preeti Jain  

Other Articles