బాహుబలి కంటే బిగ్ ఫ్లాన్? ఎటొచ్చి రాజమౌళికే దెబ్బ | Rajamouli and SRK same dream to making Mahabharata Movie.

Shah rukh khan dream of bringing mahabharata to the silver screen

Mahabharata Movie, Shah Rukh Khan Baahubali, Shah Rukh Khan Mahabharata, Shah Rukh Khan Dream Movie, Shah Rukh Khan SS Rajamouli, SS Rajamouli Shah Rukh Khan, Shah Rukh Khan Rajamouli Karan Johar, Mahabharata Rajamouli, Director Rajamouli, SRK Rajamouli Same Dream

Shah Rukh Khan talks about his dream of bringing Mahabharata to the silver screen. It should be bigger than Baahubali with International Standards.

మహాభారతం సినిమాగా తీయాలని ఉంది:షారూఖ్

Posted: 04/12/2017 10:18 AM IST
Shah rukh khan dream of bringing mahabharata to the silver screen

మహాభారతం సిల్వర్ స్క్రీన్ పై ఎలాగైనా ప్రజెంట్ చేయాలన్నది టాప్ డైరక్టర్ రాజమౌళి ఎప్పటి నుంచో కంటున్న కళ. అయితే అన్నేళ్లు డేట్లు ఇచ్చే స్టార్లు ఎక్కడ దొరుకుతారని పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఎప్పటికైనా తీసి తీరతానని మాత్రం చెప్పాడు. సరిగ్గా ఇదే కలను బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కూడా వ్యక్తం చేశాడు. మహాభారతం ను సినిమాగా తీయాలని తానూ భావిస్తున్నట్లు ఓ ప్రముఖ మాగ్జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మహాభారతం సినిమాగా తీయాలని మైండ్ లో ఉంది. అయితే అది మాములు విషయం కాదు కదా. అంత బడ్జెట్‌ నా దగ్గర లేదు. ఈ మధ్య సల్మాన్‌, కరణ్‌ కలిసి అక్షయ్ కుమార్ ను హీరోగా పెట్టి ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే తాను కూడా ఓ భారీ ప్రాజెక్టును నిర్మించాలని అనుకుంటున్నా. అందుకు ఎవరైనా చేతులు కలిపితే బావుంటుందని’ చెప్పుకొచ్చాడు. అయితే ఒకవేళ మహాభారతం అంటూ తీస్తే అది కచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్ల్ లో కూడా విజయం సాధించేదిగానే ఉండాలన్నాడు.

మహాభారతాన్ని ఏదో సామాన్య సినిమాలా తీసి వదిలేయలేమని, అది 'బాహుబలి' కంటే మరింత సమర్థవంతంగా, మరింత గొప్ప విజయం సాధించేలా ఉండాలని తెలిపాడు. ఇదిలా ఉంటే ఓ ఆధ్యాత్మిక చిత్రంలో నటించాలని ఉందని ఈ మధ్యే అమీర్ కూడా చెప్పాడు. దీంతో ఖాన్ త్రయం కలిసి మహాభారతంను సినిమాగా రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అదేదో రాజమౌళి డైరక్షన్లోనే చేస్తే పోలా. కరణ్ తలుచుకుంటే అదేం పెద్ద సమస్య కాదు కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Mahabharata Movie  Shah Rukh Khan  

Other Articles