వర్మ షాక్: అతను నా కళ్లు తెరిపించాడు.. పవన్ ఫ్యాన్స్ కు నా సారీ | RGV sorry to Pawan Kalyan Fans.

Rgv apologies to disturbing tweets

Ram Gopal Varma, RGV Apologies, RGV Sorry to Pawan Fans, Varma Vidyut Jammwal, Varma Radical Change, RGV Pawan Fans, RGV Sorry Tweets, Ram Gopal Varma Irritation Tweets, Varma Sorry to All, RGV Special Sorry

Ram Gopal Varma Apologies to all for Irritation tweets. Vidyut Jammwal reason for his radical change varma added.

నేను పూర్తిగా మారిపోయాను - రాంగోపాల్ వర్మ

Posted: 04/12/2017 11:36 AM IST
Rgv apologies to disturbing tweets

తొలినాళ్లలో సినిమాలతో కాంట్రవర్సీలు రేకెత్తించి ఆపై ట్వీట్లతో వార్తల్లో నిలిచాడు మార్విక్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. తనకు నచ్చని ఏ టాపిక్ అయినా సరే అవసరమైతే బూతు పదజాలం, ద్వంద్వ అర్థాలు వచ్చేలా సందేశాలు ఉంచటం లాంటివి చేస్తుంటాడు. తన వ్యవహార శైలితో పెద్ద పెద్ద స్టార్లను, సెలబ్రిటీలను కూడా ఇబ్బంది పెట్టిన ఘనత ఆర్జీవీది. అలాంటి వర్మ మారిపోయాడంటే ఎవరైనా నమ్ముతారా?

ఇంతకాలం నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను. ఇకపై ఎవరినీ కష్టపెట్టే వ్యాఖ్యలను తాను చేయబోనని స్వయంగా వర్మే తన ట్విట్టర్ లో ప్రకటించాడు. నేను చెప్పేది ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నేను దేవుడిని నమ్మను కాబట్టి. అందుకే మా అమ్మమీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద, అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి చెబుతున్నానంటూ ట్వీట్లు చేశాడు. ఇక వినాయకుడు, హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ సారీ చెప్పాడు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల మీదే ట్వీట్లు చేస్తున్న వర్మ సినిమాలకు సంబంధించి విషయాల ప్రస్తావన తేకపోవటం విశేషం.

ఇంతకీ వర్మలో ఈ మార్పుకు కారణం ఏంటో తెలుసా? బాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన విద్యుత్ జమాల్. మరో హీరో టైగర్ ష్రాఫ్, జమాల్ లను మార్షల్ ఆర్ట్స్ వంకతో దారుణమైన ట్వీట్లే చేశాడు వర్మ. దీనిపై రియాక్ట్ అయిన జమాల్ షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి... వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ తర్వాత తాను పూర్తిగా మారిపోయానని చెబుతూ వర్మ అందరికీ సారీ చెప్పాడు. అయితే అర్థరాత్రి వోడ్కా తాగిన వర్మ చేసిన ఆ ట్వీట్లు సీరియస్ గానేనా? అంటే.. ఏమో నమ్మలేం బాస్ అన్న సమాధానమే వినిపిస్తుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Sorry Tweets  Pawan Kalyan Fans  

Other Articles