ఎక్స్ పోజింగ్ అంటే ఉన్నపళంగా బట్టలు విప్పేయటం కాదు కదా! | Lavanya Tripathi about Glamour Roles.

Lavanya tripathi new definition for glamour roles

Lavanya Tripathi, Lavanya Tripathi Glamour, Lavanya Tripathi Exposing, Lavanya Tripathi Bikini, Lavanya Tripathi 2017, Lavanya Tripathi New Movies, Lavanya Tripathi Hottest, Lavanya Tripathi Hot, Lavanya Tripathi Semi Nude, Lavanya Tripathi Ready

Bored of the good girl image Lavanya Tripathi ready for Glamour Roles with limited extension.

గ్లామర్ అంటే లిమిట్ లోనే ఉండాలి:లావణ్య

Posted: 04/12/2017 08:53 AM IST
Lavanya tripathi new definition for glamour roles

బికినీ మోడల్ నుంచి సినిమాల్లోకి వచ్చిన లావణ్య త్రిపాఠి కెరీర్ మొత్తం సాంప్రదాయమైన రోల్స్ కే పరిమితం అయిపోయింది. అందుకేనేమో సినిమాలు కూడా ఫ్యామిలీ హిట్లుగానే పడిపోతున్నాయి. ఆ ట్యాగ్ లైన్ నచ్చని ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ ఆ మధ్య గ్లామర్ కి సిద్ధమని ఆ మధ్య ఓ ప్రకటన కూడా ఇచ్చేసింది. అంతే కొందరు టూ పీస్ బికినీ, న్యూడ్ సీన్లు ఇలా ఇష్టం వచ్చినట్లు రాసేయటంతో అందాల రాక్షసికి బాగా కాలిందంట. అందుకే మరోసారి దానిపై క్లారిటీ ఇచ్చింది. .

‘‘బేసిక్ గా నేను చాలా మోడ్రన్ అమ్మాయిని. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్ నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను.. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని. నిజానికి నా మోడలింగ్ టైంలో ఏనాడూ నిండైన బట్టల్లో కనిపించిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు పాత్రల ఎంపికలో ఇలాంటి ఛాయిస్ ఉండటం తప్పు కాదు కదా అని అంటోంది. చీరల్లో అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు. నాకు కూడా చీరలంటే చాలా ఇష్టం. అలా అని ప్రతిసారి అలాంటి పాత్రలే చేయాలంటే మాత్రం కష్టం. కొన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రకాల పాత్రలు కనిపించాలి. కాబట్టి డిఫరెంట్‌గా ఉండే పాత్రలను ఎన్నుకోవాలి' అని చెప్పింది చిన్నది.

కానీ, కొంత మంది తన స్టేట్ మెంట్ ను మరోలా అర్థం చేసుకున్నారని, గ్లామర్ అంటే ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదని చెప్పింది. రోల్ కు కావల్సినట్లు మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో గ్లామరస్ గా కనిపిస్తానని అర్ధం. పూర్వం పూర్తిగా కప్పుకుని కూడా గ్లామర్ అనేవారు. ఇప్పుడు పద్దతులు మారాయి కదా అని సమాధానం ఇచ్చింది. చూద్దాం లావణ్యను కనికరించి ఎవరు ఎటువంటి రోల్స్ ఆఫర్ చేస్తారో?. ప్రస్తుతానికి మిస్టర్ తోపాటు శర్వానంద్ రాధా, నాగ చైతన్య సినిమాల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lavanya Tripathi  Glamour Roles  New Movies  

Other Articles