ఇంటర్వెల్ లేదా? ఇదేం సినిమా బాబోయ్... | Without Interval Movie Trapped gets good reviews.

No interval bollywood movie gets good talk

Trapped Movie, Trapped Trailer, Trapped Movie 2017, Trapped Hindi Movie, Trapped Actress, Trapped Movie Hero, Trapped Review, Bollywood Movie No Interval, No Interval Movies, RajkumarRao Trapped, Geethanjali Thapa Tapped Movie

Director Vikramaditya Motwane has outdone himself with his latest project ‘Trapped‘ which is an intriguing psychological thriller based on the story of a man trapped in his own home. Rajkummar Rao and Geetanjali Thapa starer movie got good reviews.

ఇంటర్వెల్ లేని సినిమాకు పాజిటివ్ టాక్

Posted: 03/17/2017 10:55 AM IST
No interval bollywood movie gets good talk

యూనిక్ కంటెంట్ చిత్రాలకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఒక చిన్న పాయింట్ పట్టుకుని అయితే సస్పెన్స్, లేకుంటే రెగ్యులర్ ట్రాక్ లతోనే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించేస్తున్నారు కొందరు డైరక్టర్లు. దర్శకుడు విక్రమాదిత్య మోత్ వానే కూడా ఇప్పుడు సరిగ్గా ఓ ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నాడు. ‘ట్రాప్ డ్’ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నేషనల్ అవార్డు విన్నర్ హీరో రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. తన ఆఫీస్ లోనే పని చేసే కోలీగ్ ను (గీతాంజలి థాప) ను పెళ్లి చేసుకునే శౌర్య(రాజ్ కుమార్) ఊరికి బయట ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగుతాడు. కొత్తగా పెళ్లయ్యాక ఊరి నుంచి వస్తున్న తన భార్యను స్టేషన్ ను వెళ్లి రిసీవ్ చేసుకునేందుకు బయలు దేరుతాడు. ఆ కంగారులో తాను ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఇరుక్కుపోతాడు. ఆ ఫ్లాట్ కు కరెంట్, కమ్యూనికేషన్ లాంటివి ఉండవు, చెవిటి వాచ్ మెన్. పైగా ఫోన్ స్విచ్ఛాప్ ఇలాంటి పరిస్థితుల్లో బయటపడేందుకు అతనేం చేస్తాడు అన్నదే కథ.

 

గతంలో ఉడాన్, లుటేరా చిత్రాలను తీసిన విక్రమ్ ఈసారికి మాత్రం కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ముందుకు వస్తున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రానికి మరో హైలెట్ కూడా ఉందండోయ్. ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. సస్పెన్స్ థ్రిల్లర్ కావటంతో ఆ ఫీల్ పోకూడదనే ఉద్దేశ్యంతో దర్శకుడు అలా ఫ్లాన్ చేశాడంట. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది కూడా. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trapped Bollywood Movie  Good Talk  Rajkumar Rao  

Other Articles