కాటమరాయుడి సాంగ్ చాలా చాలా స్పెసల్ | Katamarayudu Title Song Really Special.

Big canvas featuring in katamarayudu title track

Katamarayudu Title Song, Katamarayudu Censor Details, Katamarayudu Censor Talk, Katamarayudu Track Details, Pawan kalyan, Katamarayudu, Katamarayudu Inside Details

Pawan Kalyan Katamarayudu Title song Details. Featuring big canvas like dancers, Sardarjis, pehelwans, School Children and Old People.

కాటమరాయుడి పాట కోసం ఏం చేశారంటే...

Posted: 03/17/2017 12:00 PM IST
Big canvas featuring in katamarayudu title track

యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటైర్ టైనర్ గా తెరకెక్కబోతున్న కాటమరాయుడికి క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం ఆశ్చర్యమే అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారు. అన్నుకున్న దానికంటే త్వరగా షూటింగ్ పూర్తి చేసేసి 24 నే థియేటర్లలో భారీ ఎత్తున్న, ముఖ్యంగా యూఎస్ లో 250 స్క్రీన్ లలో సందడి చేయబోతున్నాడు కాటమరాయుడు. ఈ లెక్కన ఫస్ట్ డే రికార్డులతోపాటు మరికొన్ని కొత్తవి క్రియేట్ అవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. చిత్ర టైటిల్ సాంగ్ యూట్యూబ్ లలో ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. ఈ పాట కోసం సెట్స్ లాంటివి కాకుండా హైదరాబాద్ శివారు గ్రామం అంజాపూర్ లో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. సుమారు 300 మంది డాన్సర్లు, 100 మంది సర్దార్ జీలు, 100 పహిల్వాన్ లు ఇలా భారీ ఎత్తున్న సందోహం పాటలో కనిపించబోతుందంట. ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్ధులంటే అమితంగా ఇష్టపడే పవన్ వారితో కూడా పాటలో సందడి చేయబోతున్నాడంట.

స్వతహాగా ప్రకృతి అంటే ఇష్టపడే పవన్ పాటలో పూర్తిగా పంచె కట్టులో ఓ పల్లెటూరి ఆసామిలా కనిపించబోతున్నాడని టాక్. ఈ పాట కోసం డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి ప్రత్యేకంగా షూట్ చేశాడు సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల. మొత్తం మీద రొమాంటిక్ ట్రాక్ లు మినహా సినిమా మొత్తం పవన్ ఖాదీ బట్టల్లోనే కనిపించబోతున్నాడన్నది మాత్రం అర్థమౌతోంది. ప్రస్తుతం అందరి కళ్లు 18న అంటే రేపు సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కమ్ పవన్ 20 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్ వేడుకల మీదే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Title Track  Pawan Kalyan  Release date  

Other Articles