మహేష్ టైటిల్ ఎలా లీక్ అయ్యిందసలు? ఉగాదికే ఫస్ట్ లుక్కా? | Koratala Mahesh title confirmed Bharath Ane Nenu.

Devi reveal mahesh babu koratala new movie title

Mahesh Babu, Koratala Siva Movie, Bharath Ane Nenu Movie, Mahesh Babu Bharath Ane Nenu, Bharath Ane Nenu Movie, Devi Sri Prasad Bharath Ane Nenu, Bharath Ane Nenu Music Director, Mahesh Babu on Murugadoss Title , Ugadi Mahesh Murugadoss Movie

Music Director Dei Sri Prasad reveals Mahesh-Koratala's film title Bharath Ane Nenu. And Mahesh Babu says Murugadoss Movie First look on Ugadi.

మహేష్ #24 టైటిల్ ఫిక్స్.. ఉగాదికి మురగదాస్ ఫస్ట్ లుక్

Posted: 03/16/2017 05:09 PM IST
Devi reveal mahesh babu koratala new movie title

మహేష్ బాబు మురగదాస్ ప్రాజెక్టు కంటే తర్వాతి చిత్రం లోనే చాలా క్లారిటీతోనే పక్కాగా ఉంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా టైటిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా జూన్ 23న సినిమాను థియేటర్లకు వచ్చి తీరుతుందని మురగదాస్ స్పష్టం చేయటం తెలిసిందే. ఇక ఇప్పుడు వైశాఖం సినిమా ఆడియో వేడుకలో
పాల్గొన్న మహేష్ ఉగాదికి ఒకరోజు అటు ఇటుగా ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు.

ఇక మహేష్ #24 కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతుందనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయ్యింది కూడా. అల్రెడీ స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వరుసగా నాలుగోసారి కూడా కొరటాల సినిమాకు దేవీయే స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవీశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా టైటిల్ ను బయటపెట్టేశాడు.

 

మ్యూజిక్ సిట్టింగ్స్ లో కొరటాల శివ కూడా భాగస్వామి అయ్యాడని, సిట్టింగ్స్ అద్భుతంగా జరగుతున్నాయని పేర్కొంటూ...'భరత్ అను నేను' అంటూ టైటిల్ సినిమాకు సంగీతం అందించే బాధ్యత అప్పగించిన మహేష్ బాబు, కొరటాల శివకు ధన్యవాదాలని తెలిపాడు. సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ ఓ పొలిటీషియన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Koratala Siva  Devi Sri Prasad  Bharath Ane Nenu Movie  

Other Articles