బాహుబలి-2, ది ప్రైడ్ ఆఫ్ సౌత్ సినిమా.. సారీ... | Celebs tweets on Baahubali 2 trailer.

Celebrities views on baahubali 2 trailer

Baahubali 2 Trailer, Baahubali Part 2 Trailer, Celebrities on Baahubali 2 Trailer, NTR Baahubali 2 Trailer, Sehwag on Baahubali 2 Trailer, Bollywood on aahubali 2 Trailer, Baahubali 2 Trailer Review

Celebs can’t stop talking about SS Rajamouli’s Baahubali The Conclusion Trailer.

బాహుబలి ట్రైలర్.. సెలబ్రిటీల రెస్పాన్స్

Posted: 03/16/2017 03:34 PM IST
Celebrities views on baahubali 2 trailer

బాహుబలి-2 సినిమా ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో... ప్రముఖులు ప్రశంసలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఏనాడూ పాజిటివ్ కామెంట్లు చేయడనే మార్క్ ఉన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశాడు. బ్లాక్ బస్టర్ కాదు, దాని అమ్మ లాంటి ట్రైలర్ అంటూ జక్కన్నకు హ్యాట్సాఫ్ చెప్పాడు.

 

ఇక రాజమౌళి ఆప్తుడు, హీరో జూనియన్ ఎన్టీఆర్ అయితే ట్రైలర్ అత్యద్భుతం అంటూ కీర్తించాడు. "మిగిలిన వాటిలా కాకుండా ఇదొక గొప్ప అనుభవం. ఈ ట్రైలర్ చూస్తుంటే నాడి కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోతుంది. ఊపిరి ఆగిపోతుంది. కను రెప్పను కూడా వేయలేరు. శభాష్ జక్కన్నా" అంటూ తారక్ ట్వీట్ చేశాడు. వెంటనే బాహుబలి టీం దానికి థాంక్స్ తారక్ అంటూ స్పందించింది.

మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశాడు. "ఔట్ స్టాండింగ్ ట్రైలర్. ప్రభాస్, రానా, రాజమౌళి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. మరో హీరో అల్లరి నరేష్ కూడా ఈ ట్రైలర్ పై తన అనుభూతిని పంచుకున్నాడు. ఇది పక్కా కింగ్ సైజ్ ట్రైలర్ అంటూ ట్వీట్ చేశాడు. జీనియస్ రాజమౌళికి, ప్రభాస్, రానా, చిత్ర యూనిట్ కు హ్యాట్సాఫ్ అని తెలిపాడు.

సమంత, రకుల్, రామ్, నారా రోహిత్, నిఖిల్, ఇలా పలువురు యంగ్ స్టర్లు కూడా కంక్లూజన్ ట్రైలర్ పై ఎగ్జయిట్ అవుతూ ట్వీట్లు చేశారు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా పలువురు టాప్ సెలబ్రిటీలు బాహుబలి ట్రైలర్ పై ఒపినీయన్లు చెబుతున్నారు. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తోపాటు తరుణ్ ఆదర్శ్, రాజీవ్ మసంద్ లాంటి విశ్లేషకులు రాజమౌళి జీనియస్ అంటూ, ట్రైలర్ అమోఘం అంటూ ట్వీట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2 Trailer  Celebrities Tweets  

Other Articles