2017 ఆస్కార్ విజేతలు వీరే... భారత్ బిగ్ హ్యాండ్ | No Indians in 89th Oscar Winners.

Oscars 2017 full winners list

Oscars The Complete Winners List, Oscars 2017 complete winners list, La La Land Six Oscars, Oscars Winners List, 89th Annual Academy Awards, Oscars Complete List of Presenters, Oscar Awards 2017 Nominees, The Salesman Asghar Farhadi Trump, Moonlight Best Movie

The 89th Annual Academy Awards, hosted by Jimmy Kimmel, aired on Sunday night. With a staggering 14 nominations – tying the record for most nods previously held by Titanic and All About Eve – La La Land was considered the movie to beat. Moon Light won best picture award.

89 ఆస్కార్ అవార్డు విజేతల పూర్తి జాబితా

Posted: 02/27/2017 01:07 PM IST
Oscars 2017 full winners list

ప్రతిష్టాత్మక అవార్డుల కోసం హాలీవుడ్ రాజసం అంతా ఒక్క చోట చేరింది. లాస్‌ ఏంజిల్స్‌ లో 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా సాగగా, అత్యధిక కేటగరీల్లో నామినేట్ అయిన 'లా లా ల్యాండ్' అవార్డుల పంట పండించుకుంది. (లా లా ల్యాండ్ ఓ చెత్త సినిమా?) పలువురు సినీ ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్న అకాడమీ అవార్డుల కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాద భరితంగా సాగింది. తొలిసారిగా ఆస్కార్ చరిత్రలోనే ఓ ముస్లిం వ్యక్తికి అవార్డు రావటం విశేషం. మూన్ లైట్ సినిమాలో సహయనటుడి కేటగిరీలో మెహర్షల్ అలీ దక్కించుకున్నాడు. 

ఇక విదేశీ చిత్రాల్లో ది సెల్స్ మెన్ ను ఆస్కార్ వరించగా, ట్రంప్ విధానాలతో చిత్ర దర్శకుడు అస్గర్ పర్హాదీ ఈవెంట్ కు గైర్హాజరీ తన నిరసన వ్యక్తం చేశాడు.ఇక ఈ దఫా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వారి పూర్తి వివరాలివే.

 

ఉత్త‌మ చిత్రం: మూన్‌ లైట్‌

ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌ (మాంచెస్ట‌ర్ బై ద సీ)

ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌)

ఉత్త‌మ స‌హాయ‌న‌టి: వివోలా డేవిస్‌ (ఫెన్సెస్‌)

అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్‌ లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌ క్ర‌నే)

ఉత్త‌మ స్క్రీన్‌ ప్లే: మాంచెస్ట‌ర్‌ బై ద సీ (కెన్న‌త్ లొనెర్గాన్‌)

ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌: లా లా ల్యాండ్‌

ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌: సిటీ ఆఫ్ స్టార్స్‌ (లా లా ల్యాండ్‌)

ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం: లాలా ల్యాండ్‌ (లిన‌స్ శాన్‌ గ్రెన్‌)

ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌: సింగ్ (క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ)

ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌ (ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌)

ఉత్త‌మ ఎడిటింగ్‌: హాక్సా రిడ్జ్‌ (జాన్ గిల్బ‌ర్ట్‌)

ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌ జాన్స్, డ్యాన్ లెమ‌న్‌)

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: లాలా ల్యాండ్‌ (డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌)

యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌ (అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌ మెర్‌)

యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం: జుటోపియా (బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌)

ఉత్త‌మ విదేశీచిత్రం: ది సేల్స్‌ మ్యాన్‌ (ఇరాన్‌)

సౌండ్ మిక్సింగ్‌: హాక్సా రిడ్జ్‌

సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌ (బెల్లీమార్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఓజె మేడ్‌ ఇన్‌ అమెరికా (ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్‌ (కొలెన్‌ ఉడ్‌)

ఉత్త‌మ అలంక‌ర‌ణ‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ (అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌)

ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ (మూన్‌ లైట్‌)

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 89th Annual Academy Awards  Oscar 2017  La La Land  Moonlight  The Sales Man  

Other Articles