ఆ సినిమా టైటానిక్ కన్నా తోపా? | Rishi Kapoor trolled over comments on La La Land.

Rishi kapoor sensational tweets on la la land

Rishi Kapoor, Rishi Kapoor Troll, La La Land Oscar, Rishi Kapoor Oscar Awards, Rishi Kapoor Oscar, Rishi Kapoor Twitter, La La Land Movie, La La Land 14 Nominations, La La Land Titanic, Rishi Kapoor Controversy Tweets

Bollywood Veteran Actor Rishi Kapoor Brutally Trolled On Twitter For Taking A Dig At ‘La La Land’ Oscar Nominations.

ఆస్కార్ నామినేటెడ్ సినిమాపై రిషి కపూర్ విమర్శలు

Posted: 02/15/2017 02:53 PM IST
Rishi kapoor sensational tweets on la la land

వెటరన్ నటుడు రిషి కపూర్ ఎంత ముక్కుసూటి మనిషో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బయోగ్రఫీ ‘ఖుల్లం ఖుల్లా’లోని కొన్ని పేజీలు తిప్పితే చాలూ ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. అయితే అలా ఓపెన్ గా ఉండటమే ఒక్కోసారి ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది కూడా. తాజాగా మరోసారి ఆయన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.

అత్యధిక కేటగిరీల్లో నామినేట్ అయిన హాలీవుడ్ మ్యూజికల్ మూవీ లా లా లాండ్ పై ఆయన చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారింది. రికార్డు స్థాయిలో 14 కేటగిరీల్లో నామినేట్ అయిన ఈ చిత్రం ఆయనకు అస్సలు నచ్చలేదంట. అందుకే పోయి పోయి ఆ సినిమాను అన్ని విభాగాల్లో ఎందుకు నామినేట్ చేశారంటూ తన ట్విట్టర్ లో దుమ్మెత్తి పోశాడు.

దీంతో రంగంలోకి దిగిన ఆ చిత్ర అభిమానులు రిషి కపూర్ పై తిట్ల పురాణం వల్లించారు. డబ్బులిచ్చి అవార్డులు కొనుకున్న నీకు ఆ చిత్రంపై మాట్లాడే అర్హత లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా తగ్గని రిషి కపూర్ సారీ చెప్పే ప్రసక్తే లేదంటూ తేల్చేశాడు కూడా. కాగా, టైటానిక్ సినిమా తప్ప మరేయిత చిత్రం ఇంతదాకా అన్ని కేటగిరీల్లో నామినేట్ కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : La La Land  Oscar Nominations  Rishi Kapoor  Twitter  

Other Articles