సమంత ఎమోషనల్ ‘హర్ట్ ఎటాక్’ ట్వీట్.. కొత్త అనుమానాలు?? | Samantha Emotional tweets raised doubts.

Samantha s emotional message on cine carrier

Samantha Emotional Tweet, YMC 7 Years, Samantha Shares Experience, Samantha Good Bye Movies, Actress Samantha, Samantha Wedding, Samantha Naga Chaitanya, Actress Samantha Heart Attck, Ye Maya Chesave

Samantha an Emotional Message in Her Twitter on Ye Maaya Chesave completing 7 years. After marriage she may good bye to Movies.

సమంత ఏడేళ్ల అనుభవం.. ఎమోషనల్ మెసేజ్

Posted: 02/27/2017 09:20 AM IST
Samantha s emotional message on cine carrier

చెన్నై బ్యూటీ సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సరిగ్గా ఏడేళ్లు అవుతుందంట. 2010లో ఫిబ్రవరి 26న విడుదలైన 'ఏం మాయ చేశావే'లో ఆమె అక్కినేని నాగ‌చైత‌న్య స‌ర‌స‌న క‌నిపించిన విష‌యం తెలిసిందే. అనంతరం కొద్ది కాలంలోనే దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఇక ఈ ఏడేళ్ల అనుభ‌వాల‌ను త‌న అభిమానుల‌తో ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది సౌత్ డాల్, ఓ పెద్ద పోస్ట్ ను పెట్టేసింది.

కష్టాలు, అపజయాలు, విచారం, స‌క్సెస్‌, మంచి పేరు రావ‌డం, సంపద ఇలా ఎన్నో అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని చెప్పింది. సంతోషంగా జీవించడం అనేది అంత సామాన్యమైన విషయమేం కాదని పేర్కొన్న శామ్‌... సాధారణంగా జీవించడం ఎలాగో త‌న‌కు ఈ ఏడేళ్ల కాలంలోనే తెలిసింద‌ని తెలిపింది. సమస్య వచ్చిన ప్రతిసారీ త‌న‌కు హార్ట్ ఎటాక్ రాదని, తాను చ‌నిపోనని ఈ భామ పేర్కొన‌డం విశేషం.

సినీ జీవితం త‌న వ్య‌క్తిగ‌త‌ జీవితంలోకి కొందరిని పరిచయం చేసిందని ఆ అమ్మ‌డు తెలిపింది. త‌న‌కు సినీ జీవితం ఒక‌ వరం అని చెప్పింది. సినీ పరిశ్రమ ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ ప్రేమను త‌న‌కు అందించిందని పేర్కొంది. చివ‌ర‌గా అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు, త‌న అభిమానుల‌ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాన‌ని పేర్కొంటూ చైతూతో ఉన్న ఓ రొమాంటిక్ ఫోటోను అప్ లోడ్ చేసింది. అంతా అనుకోని విధంగా జరిగిన తన లైఫ్ చివరకు ఓ అద్భుతంతో ముగియబోతుందన్న సమంత వ్యాఖ్యలు చూస్తుంటే పెళ్లి తర్వాతే నటనకు గుడ్ బై చెప్పే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం మరో అక్కినేని వారసుడి ప్రేమ బ్రేకప్ కావటంతో త్వరగతిన పెళ్లి చేసుకోవాలని ఈ జంటపై తీవ్ర ఒత్తిడిపడుతున్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  Emotional Tweet  YMC 7 Years  

Other Articles