పార్టీలకు సంజూ భాయ్ ని ఎంతగా వాడుకున్నాడంటే... | Used to wear Sanjay Dutt's suits to parties.

Anil kapoor rented sanjay dutt suits to wear at parties

Anil Kapoor, Anil KapoorSanjay Dutt, Anil Kapoor Gulshan Grover, Gulshan Grover Sanjay Dutt, Gulshan Grover Ram Lakhan, Ram Lakhan 30 Years, Ram Lakhan Remake, Sanjay Dutt Suits Anil Kapoor

While there have been many stories of the good bond they share, Anil Kapoor has revealed that there was a time when he used to attend parties wearing Sanjay Dutt’s suits on rent. Kapoor, Jackie Shroff, Satish Kaushik and Gulshan Grover reunited to celebrate the 30th year of Ram Lakhan at Subhash Ghai’s newly launched theatre, MuktaA2, previously called New Excelsior. At the event, footage of the premiere of Ram Lakhan was showed which featured a young Kapoor in a suit. “One thing I have to say is that the suit that I wore on the premiere, I am sure it was 100% a rented suit. It wasn’t mine,” Kapoor quipped at the launch. “And he used to give Anil Kapoor suits of Sanjay Dutt while I used to get only shirts. He never thought I would become an actor,” Grover said.

అప్పట్లో సంజయ్ దత్ సూట్లు వేసుకునేవాడిని: అనిల్ కపూర్

Posted: 02/10/2017 05:27 PM IST
Anil kapoor rented sanjay dutt suits to wear at parties

సెలబ్రిటీల అండర్ కవర్ స్టోరీలు వెలుగులోకి వచ్చినప్పుడు , ముఖ్యంగా క్లాసిక్ చిత్రాల విషయంలో ఇలాంటివి విన్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. సరిగ్గా ఇప్పుడు అలాంటి విషయాలే చెబుతున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.

బాలీవుడ్ క్లాసిక్ మూవీ రామ్ లఖన్ విడుదలై 30 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్ తాను కొత్తగా ప్రారంభించిన ఓ థియేటర్ లో టీం మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి చిత్ర హీరోలైన జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, విలన్ పాత్ర పోషించిన గుల్షన్ గ్రోవర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రంలోని సీన్లను ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రధాన తారాగణం మధ్య డిస్కషన్లు పెట్టారు.

అందులో ఓ సన్నివేశంలో అనిల్ కపూర్ సూట్ లో కనిపిస్తాడు. వెంటనే మైక్ అందుకున్న అనిల్ అది తనది కాదని చెప్పుకొచ్చాడు. తనకు సొంత సూట్లు లేకపోవడంతో డిజైనర్ అక్బర్ దగ్గరకు వెళ్లి అడిగితే, వేరే నటుల సూట్లను ఆయన అద్దెకు తెచ్చేవారని, అలా తీసుకువచ్చిన వాటిలో నటుడు సంజయ్ దత్ వి తనకు ఇచ్చేవారని అన్నాడు. అవే వేసుకుని పలు పార్టీలకు కూడా హాజరయ్యేవాళ్లమంటూ చెప్పుకొచ్చాడు.

అయితే, సంజయ్ దత్ బాడీకి, తనకు చాలా తేడా ఉండటంతో ఆ సూట్లు తనకు కొంచెం వదులుగా ఉండేవని చెప్పుకొచ్చారు. ఇంతలో గుల్షన్ గ్రోవర్ మైక్ లాక్కుని అనిల్ కపూర్ కు, తనకు ధరించేందుకు సూట్లు ఉండేవి కాదని, అనిల్ కు సంజయ్ దత్ సూట్లు దొరికేవని, తనకు మాత్రం కేవలం చొక్కాలే దొరికేవని చెప్పటంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇక ప్రోగ్రాంకి హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను ఆహ్వానించకపోవటంపై తొలుత విమర్శలు వినిపించటంతో ఆమె విదేశాల్లో ఉందంటూ వివరణ ఇచ్చాడు దర్శకుడు సుభాష్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Lakhan  30 years Celebrations  Anil kapoor  Gulshan Grover  

Other Articles