అమెరికాలో పవన్ అలా దొరికిపోయాడు.. షాక్ తిన్న ఫ్యాన్స్ | Pawan Picks Pyjamas and Lands In USA.

Pawan kalyan spotted at boston airport

Pawan Kalyan, Pawan Kalyan America Tour, Pawan Kalyan Boston Airport, Pawan Kalyan Lalchi Pyjama, Pawan Kalyan Spotted, Pawan Kalyan At America, Pawan Kalyan America Schedule, Pawan Kalyan Harvard University, Pawan Kalyan American NRIs, Pawan kalyan AIrport, Pawan Kalyan Khaadi, Pawan Wife America, Pawan with Third Wife, Pawan Wife Airport

Actor Pawan Kalyan got sighted at Boston airport. He picked his clothes while leaving for the overseas tour. As Pawan got the invitation immediately his team has readied half a dozen designer suits for the actor. However in the end Pawan rejected them all, saying that he doesn't want to appear like a Westerner talking to set of NRI Indians in the USA, but he wants to appear like an Indian talking to his fellow world mates. For that reason Pawan ordered for two new pairs of Khaadi lalchi and pyjama. Leaving all those designer made clothes here in the closet, he flew to USA with his Khaadi wear.

అమెరికాలో పవన్.. భార్యతో ఎయిర్ పోర్ట్ లో సందడి

Posted: 02/09/2017 07:49 AM IST
Pawan kalyan spotted at boston airport

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ నాలుగు రోజుల అమెరికా పర్యటన కోసం బయలుదేరిన విషయం తెలిసిందే. బోస్టన్ ఎయిర్ పోర్ట్ లో నిన్న సాయంత్రం ల్యాయండ్ అయిన పవన్ అక్కడి అభిమానులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు కారణం పవన్ డ్రెస్సింగ్ అవతారం. ఇన్విటేషన్ రాగానే పవన్ కోసం నాలుగు ఖరీదైన డిజైనర్ సూట్స్ సిద్ధం చేసేశారట పవన్ టీం. బెస్ట్ డిజైనర్స్ ను పిలిపించి అత్యుత్తమైన ఫ్యాబ్రిక్ తో.. పవన్ సూచనల మేరకు హుందాగా కనిపించేలా వీటి డిజైనింగ్ జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఆఖరి నిమిషంలో పవన్ ఇవేవీ వద్దని చెప్పేశాడట.

అమెరికా వెళ్లి పశ్చిమ దేశాల సంస్కృతి ప్రకారం వెస్ట్రన్ వేర్ అయిన కోట్స్ వేసుకోవడం కంటే.. ఎక్కడికి వెళ్లినా ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబించేలా దుస్తులు వేసుకోవడమే సరియైన పని అన్నాడట పవన్. అప్పటికప్పుడు కొన్ని పైజమా-కుర్తాలను తెప్పించుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు పవర్ స్టార్. అదే డ్రస్సులో అమెరికా ఎయిర్ పోర్టులలో పలువురికి కనిపంచాడు కూడా. పూర్తిగా ఖాదీ దుస్తుల్లో పవన్ ని చూసి.. చాలామంది ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.

ఇక భార్య అన్నా లెజ్ నోవా తో ఉన్న మరో రెండు ఫోటోలు కూడా నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Pawan with Wife in America

Pawan with Anna Lezhneva

 

పవన్ పర్యటన షెడ్యూల్ ఇది...

 

ఈ నెల 9 నుంచి 12 వ తేది వరకు పవన్ కళ్యాణ్ ఐదు రోజలు వివిధ సమావేశాల్లో పాల్గొనడంలతోపాటు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్ధించిన వివిధ రంగాల ప్రముఖులుశాస్త్రవేత్తలు ఐటీ నిపుణులను కలుసుకుంటారు. అయితే ఈ టూర్ లో పవన్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారు ఏం మాట్లాడనున్నారనే దానికి క్లారిటీ వచ్చింది. తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు (బోస్టన్ కాలమానం) న్యూక్లియర్ అండ్ యాంటి న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యూబన్ లలో గంటసేపు పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతారు. ఎనర్జీ పాలసీ రూపకల్పనలో నిపుణుడైన ప్రొఫసర్ హెన్రీలీ లో 11 నుంచి 12 గంటల వరకు సంభాషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న EDX సంస్థ CEO అనంత్ అగర్వాల్ లలో మధ్యాహ్నం సమావేశమవుతారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆర్గనైజ్ క్యాంపెయిన్ లో ప్రొఫెసర్ అయిన మార్తల్ గంజ్ లో పవన్ సమావేశం ఉంటుంది.

పదో తేదీ ఉదయం 8 గంటలకు బోస్టన్ రాష్ట్రంలోని సీబ్రూక్ న్యూక్లియర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ నిపుణులలో మాట్లాడతారు . సుమారు రెండు గంటల సేపు పవన్ అక్కడ గడుపుతారు. 11.45 నిమిషాలకు కాన్కార్టర్ లోని హాంప్ ఫైర్ సైట్ హౌస్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు సెనేటర్లు అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సర్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రెండు తరువాత హాంప్ ఫైర్ గవర్నర్ లో బెటి అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నార్తర్ హాంప్ ఫైర్ లోని నషువా సిటి చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు తెలుగుఆడపడుచు లత మంగిపూడి గారితో పవన్ సమావేశం జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతివారు నిర్వహిస్తున్న కార్ ర్యాలిలో పాల్గొంటారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన డిన్నర్ రిసెప్టన్ స్థలికి చేరుకుంటారు. అక్కడ పూర్ణకుంభంలో పవన్ కళ్యాణ్ ను స్వాగతిస్తారు. తెలుగు లలిత కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీలకు చెందిన సెనేటర్లు నషువా (NASHUA) మేయర్ ఎన్నారైలను ఉద్దేశించి కళ్యాణ్ ప్రసంగిస్తారు.

నాలుగో రోజైన 11 వ తేదిన హార్వర్టర్ యూనివర్సిటీ లో "బికమింగ్ జనసేనాని " అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రికి శ్రీ పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ డిన్ నితిన్ నోట్రాయా తాజ్ బోస్టన్ లో విందు ఇస్తారు. చివరిరోజైన 12వ తేదిన (బోస్టన్ కాలమానం) హార్వర్టర్ యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు. సహజంగా ఇక్కడ ఉపన్యాసకులకు అరగంట సేపు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు సుమారుగా గంట సమయాన్ని నిర్వాకులు కేటాయించడం గమనార్హం. 11 12 ఇదే సమావేశాల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి వస్తున్న ఎస్.వై.ఖురేషి -ఒమర్ అబ్దుల్లా - కృష్ణ బైరేగౌడ - శశిథరూర్ - గురురాజ్ దేశ్ పాండే - నితిన్ నోహ్రీయా తదితరులతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ తిరుగు పయనమవుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ హార్వర్డ్లో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  America Tour  Boston Airport  Lalchi Pyjama  

Other Articles