సింగం-3లో దేవి ఎందుకు లేడంటే.. | Why Devi Sri Prasad not part of Singam 3.

Suriya intentionally set a side devi sri prasad

Suriya Singam 3, Singam 3 Music Director, Devi Sri Prasad Suriya, Suriya Singam 3 Interview, Devi Sri Prasad Singam 3, Suriya About Devi Sri Prasad, Devi Sri Prasad Singam Series, Singam 3 Interview, Hero Suriya Reveal

Suriya reveals why Devisri Prasad not part of 'Singam 3'.

కావాలనే దేవీని పక్కకు పెట్టాం: సూర్య

Posted: 02/06/2017 04:54 PM IST
Suriya intentionally set a side devi sri prasad

ఓ హిట్ కాంబోను సడన్ గా మార్చేస్తే లేనిపోని అనుమానాలు కలగటం సహజం. ఇంతకు ముందు తన రెండు సింగం సిరీస్ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకున్న సూర్య తాజా చిత్రంకు హ్యారిస్ జైరాజ్ ను తీసుకుని ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో దేవీ కూడా అలా జరిగిపోయిందని, కారణాలేవీ అడగొద్దంటూ మీడియాకు చెప్పాడు కూడా. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న పుకారు రేగింది.

మాస్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన దేవీని కాదని, హరిస్ తో ఎందుకు చేయించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సూర్య బదులిస్తున్నాడు. దేవిశ్రీని మూడో పార్టుకు తప్పించేయడం పెద్ద షాకే. ఐతే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని చెబుతున్నాడు. ‘‘దేవిశ్రీని సింగం మూడో భాగానికి దూరంగా పెట్టడం అన్నది కఠిన నిర్ణయం. ఐతే సినిమా కోసమే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగం మూడో భాగం విషయంలో కొంచెం కొత్తదనం ఉండాలని అనుకున్నాం. హ్యారిస్ జైరాజ్ నాతో చాలా సినిమాలు చేశాడు. నా సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇస్తాడతను. నా టేస్టేంటో అతడికి బాగా తెలుసు. కొంచెం భిన్నమైన మ్యూజిక్ ఉండాలనే హ్యారిస్ ను తీసుకున్నాం. అని చెప్పాడు.

దేవిశ్రీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మాకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాడు’’ అని సూర్య తెలిపాడు. అయితే ఈ దేవిశ్రీ హర్ట్ కాకుండా తాను చూసుకున్నట్లు సూర్య వివరించాడు. మరోవైపు వరుసగా ‘సింగం’ సిరీస్ లో మూడు సినిమాలు చేసినా తనకేమీ బోర్ కొట్టలేదని.. జనాల నుంచి ఈ సినిమా కోసం డిమాండ్లు రావడంతోనే వాళ్ల ఆసక్తికి తగ్గట్లుగా సినిమా చేశామని.. ‘సింగం’ ఫ్రాంఛైజ్ మున్ముందు కూడా కొనసాగుతుందని తెలిపాడు సూర్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Suriya  Singam-3  Music Director  Harris Jairaj  Devi Sri Prasad  

Other Articles