మహేష్-కొరటాల ఆ హీరోయిన్ తో.. పెద్ద రిస్క్ | Mahesh Babu Risk with New Heroine.

Mahesh koratala movie heroine not fix

Mahesh Babu, Koratala Siva, Mahesh Koratala New Movie, Koratala Siva Mahesh Babu, Mahesh Babu New Heroine, Mahesh Babu 23rd Movie, Mahesh Babu Fresh Face, Mahesh Dare Decision, Mahesh Babu New Movie, Mahesh Babu 2017, Mahesh Babu Upcoming Movies

A fresh face opposite Mahesh Babu in Koratala Siva film. Interestingly, established actresses are also trying to grab the project.

మహేష్-కొరటాల హీరోయిన్ ఎవరంటే...

Posted: 02/06/2017 04:16 PM IST
Mahesh koratala movie heroine not fix

ప్రస్తుతం మురుగదాస్ మూవీ చేస్తోన్న మహేశ్ బాబు, ఆ తరువాత కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న విషయం కూడా గత కొంత కాలంగా ఓ సెన్సేషన్ గా మారిపోయింది. కారణం ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయటమే. మళ్లీ వీరిద్దరు కలిస్తే ఏం మ్యాజిక్ చేయబోతున్నారోనని ప్రేక్షకులతోపాటు, అభిమానులు కూడా ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్ డేట్ బయటికి వచ్చింది.

ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మహేశ్ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి, పెద్దగా గ్యాప్ అనేది లేకుండా షూటింగ్ కానిచ్చేయాలని కొరటాల అనుకుంటున్నాడట. కొత్త కథానాయిక అయితే డేట్స్ సమస్య వుండదు కనుక, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఆ ఛాన్స్ వస్తే వదులుకోకూడదనే ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఫ్రెష్ ఫేస్ నిర్ణయం తీసుకుంటే మాత్రం అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవ్వటం ఖాయమేనే అనుకోవచ్చు.

మార్చి ఎండ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజా చిత్రానికి సంబంధించిన ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Koratala Siva  Heroine  

Other Articles