అఖిల్ పెళ్లి వాయిదా ఛాన్సే లేదు | Naga chaitanya to marry first, not akhil.

Akkineni marriages in dilemma

Naga chaitanya, Naga chaitanya Samantha, Samantha, Akhil Samantha, No clarity on Naga chaitanya Marriage, Chay Sam Marriage, Naga chaitanya to marry first, Akhil marriage postponed, Akhil Shriya Bhupal, Naga Chaitanya Samantha, Samantha 2016, Akkineni Nagarjuna Sons, Akkineni Marriages

No clarity on Naga chaitanya to marry first. Akhil after.

అక్కినేని పెళ్లిళ్లపై మళ్లీ కన్య్ఫూజన్

Posted: 12/28/2016 08:25 AM IST
Akkineni marriages in dilemma

అన్న కంటే ముందుగానే ప్రేయసిని ఎంగేజ్ మెంట్ చేసుకుని త్వరగానే ఓ ఇంటి వాడు అయిపోదామని ఫ్లాన్ లో ఉన్నాడు అక్కినేని అఖిల్. అయితే నాగ్ మాత్రం ఈ విషయంలో మరోసారి ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ అక్కినేని అన్నదమ్ముల్లో ముందు ఏడడుగులు వేసేది ఎవరంటే? అఖిల్‌ పేరు వినిపించింది కూడా. ఇక సమంతతో ప్రేమ, పెళ్లికి రెడీ అయిపోయిన నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య, వచ్చే ఏడాది ఏడడుగులు వేస్తానని చెప్పినప్పటికీ ఎప్పుడనేది స్పష్టంగా చెప్పలేదు.

ఈ మధ్య జనవరి 29న వారిద్దరి నిశ్చితార్థం ఉండబోతుందన్న ఓ వార్త మాత్రం వెలువడింది. అయితే అక్కినేని ఫ్యామిలీ ఆ తేదీని ఓకే చేయలేదు. అలాగని ఖండించలేదు. దీంతో ఆ రోజే వీరిద్దరు ఎంగేజ్ అవుతారని ఫిక్స్ కావొచ్చు. నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. ఇక ఇంకో కొత్త కబురు ఏంటంటే... చైతూ, సమంతలు సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటు న్నారట.

అఖిల్‌–శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసింది. అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో పెళ్లి చేసుకుంటే(మీడియా గొడవ లేకుండా) బాగుంటుందని చైతూను కోరినప్పటికీ, అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో అఖిల్‌ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని నాగ్ యత్నిస్తున్నాడని, అందుకే వచ్చే ఏడాది చివర్లో చేయాలనుకున్న పెళ్లి త్వరగతిన చేయాలని యత్నిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మొన్నామధ్య అఖిల్ పెళ్లి పనులు కూడా మొదలైనట్లు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చైతూ పెళ్లి అఖిల్ కంటే ముందు జరుగుతుందన్న వార్తలో వాస్తవం ఏ మాత్రం ఉందంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Naga chaitanya  Samantha  Akhil Akkineni  Shriya Bhupal  

Other Articles